BigTV English

Allu Arjun: పుష్ప2 దెబ్బకు బాలీవుడ్ విలవిల.. అసలేమైందంటే..?

Allu Arjun: పుష్ప2 దెబ్బకు బాలీవుడ్ విలవిల.. అసలేమైందంటే..?

Allu Arjun.. దేశం మొత్తం పుష్ప 2 (Pushpa 2)మత్తులో ఊగిపోతోంది అని చెప్పవచ్చు. అందుకే వేరే సినిమా థియేటర్లలోకి రావాలంటేనే ఆ సినిమా నిర్మాతలు కూడా భయపడిపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో జరుగుతున్న పరిస్థితి ఇది. ప్రస్తుతం అక్కడి ఆడియన్స్ పుష్ప 2 సినిమాను ఎంతగా ఓన్ చేసుకున్నారు అంటే, అది సౌత్ సినిమా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి మరీ సొంత సినిమాగా ఫీల్ అయిపోతున్నారు అంటూ సౌత్ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు ఇప్పటికీ అక్కడ కలెక్షన్స్ స్టాండర్డ్ గా వస్తున్నాయి అంటే బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా మత్తులో ఎంతగా మునిగి తేలుతున్నారో అర్థమవుతుంది.అందుకే అక్కడి మేకర్స్ కి కొత్త భయం చుట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప2 సినిమా కథకు ముగ్ధులైన బాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు తమ సినిమా కథలను మెచ్చుకుంటారా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోందట. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


రూ.2000 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు..

అల్లు అర్జున్(Allu Arjun)హీరోగా సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో ‘పుష్ప’ సీక్వెల్ గా వచ్చిన చిత్రం పుష్ప 2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక దీనిని బట్టి చూస్తే నెలరోజులు పూర్తికాకుండానే ఈ సినిమా రూ.2000 కోట్ల క్లబ్లో చేరిపోతుంది అనడంలో సందేహం లేదని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా బాలీవుడ్ విషయానికొస్తే.. ఈ సినిమా అక్కడ వరుస కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది.


పుష్ప 2 దెబ్బకి ఆందోళనలో బాలీవుడ్ మేకర్స్..

ఇదిలా ఉండగా బాలీవుడ్ లో డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ‘బేబీ జాన్’ సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)హీరోగా, మహానటి కీర్తిసురేష్(Keerthi Suresh) హీరోయిన్ గా రాబోతున్న చిత్రం బేబీ జాన్. అట్లీ నిర్మించిన ‘తేరీ’ సినిమా రీమేక్ గా రాబోతోంది. ఈ సినిమాకి కలీస్ (Kalees)దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్ కూడా గ్యాప్ లేకుండానే చేస్తున్నారు. కానీ అటు డిస్ట్రిబ్యూటర్స్ లో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప 2 మత్తులో ఉన్న ఆడియన్స్ కి ఈ రొటీన్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏ మేరకు ఎక్కుతుంది అనే డౌట్స్ వారిలో కలుగుతున్నాయి.అయితే ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారని నిర్మాతగా అట్లీ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్(Salman Khan)కామెడీ పాత్ర పోషిస్తూ ఉండగా.. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప2 దెబ్బకు బాలీవుడ్ వర్గాలలో కొత్త టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. మరి ఏ మేరకు బేబీ జాన్ సినిమా అక్కడి ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి. మొత్తానికైతే సౌత్ సినిమాగా వచ్చి బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది పుష్ప2. ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna)హీరోయిన్గా నటించగా.. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×