Stress Symptoms: నేటి బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయిందని చెప్పవచ్చు. ఒత్తిడి అధికంగా ఉంటే, అది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. అంతే కాకుండా అనేక తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది.
ఏ వ్యక్తి అయినా ఒత్తిడికి లోనవుతున్నప్పుడు, దాని లక్షణాలు కొన్ని కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా నిద్ర, అలసట , బలహీనతకు సంబంధించిన సమస్యలు కూడా ఒత్తిడి కారణంగానే వస్తుంటాయి. ఒత్తిడికి గురయ్యే కొన్ని ప్రారంభ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఒత్తిడిలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి 8 సంకేతాలు
నిద్రలేమి లేదా అధిక నిద్ర: ఒత్తిడి నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. ఒత్తడికి గురయినప్పుడు మీరు అధికంగా నిద్ర పోవచ్చు. లేదా నిద్ర లేమికి కూడా గురి కావచ్చు.
అలసట, బలహీనత: ఒత్తిడి వల్ల మీరు ఏమీ చేయకపోయినా శరీరం అలసిపోతుంది. ఫలితంగా ఏ పని అయినా సక్రమంగా చేయలేరు
తలనొప్పి: ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి సాధారణ సమస్య. ఈ నొప్పి తేలికపాటి లేదా తీవ్రంగా ఉండవచ్చు.
కడుపు సంబంధిత సమస్యలు: ఒత్తిడి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది మలబద్ధకం, అతిసారం లేదా అజీర్ణం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.
చిరాకు, అశాంతి: ఒత్తిడి కారణంగా, మీరు చిన్న విషయాలకు కూడా చిరాకు పడతారు. అంతే కాకుండా విశ్రాంతి లేకుండా ఉంటారు.
ఏకాగ్రతలో ఇబ్బంది: ఒత్తిడి కారణంగా మీరు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. చేయాల్సిన పనులను పదే పదే మరచిపోతారు.
కండరాల ఒత్తిడి: ఒత్తిడి కండరాల ఒత్తిడికి కారణమవుతుంది. ఇది భుజం, మెడ నొప్పులకు దారితీస్తుంది.
ఆకలిలో మార్పులు: తినే ఆహారం విషయంలో కూడా ఒత్తిడి ప్రభావం చూపుతుంది.
Also Read: పాలల్లో సోపు కలిపి తాగితే.. మతిపోయే లాభాలు
ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు:
యోగా, ధ్యానం
వ్యాయామం
తగినంత నిద్ర
ఆరోగ్యకరమైన ఆహారం
స్నేహితులు,కుటుంబ సభ్యులతో సమయం గడపడం
హాబీస్
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.