BigTV English
Advertisement

Hyderabad Gun Firings : పక్కా ప్లాన్‌తోనే అటాక్..

Hyderabad Gun Firings : పక్కా ప్లాన్‌తోనే అటాక్..

Hyderabad Gun Firings : హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.స్నేహపురి కాలనీలోని మహదేవ్ జువెలరీ షాపులో చొరబడి ఫైరింగ చేశారు. జువెలరీ ఓనర్ తో పాటు నగల వ్యాపారి సుఖ్ దేవ్ లపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో వాళ్లిద్దరూ కుప్పకూలిపోయారు.


సుఖ్ దేవ్, రాజకుమార్ పలు జ్యువెలరీ షాపుల్లో అమ్మిన నగల తాలూకా నగదుతో పాటు….. మూడు కేజీల బంగారం తీసుకుని మహదేవ్ జువెలరీ షాపుకు వచ్చారు. దీన్ని గమనించిన దుండగులు…పక్కా ప్లాన్ తో వారిని టార్గెట్ చేశారు. తొలుత ఆగంతుకులు షాపు లోపలికి ప్రవేశించారు.షెటర్ ను కిందికి దింపి తుపాకులతో బెదిరించారు. కొద్దిసేపు షాప్ యజమాని కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత….ఫైరింగ్ జరిపారు. నగల వ్యాపారి కళ్యాణ్ తో పాటు …..నగల వ్యాపారి సుఖ్ దేవ్ లపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఐదు లక్షల రూపాయల నగదు, మూడు కేజీల బంగారు ఆభరణాలతో బైక్ పై ఉడాయించారు.

తుపాకీ బుల్లెట్ సౌండ్ల మోత విన్న చుట్టుపక్కల షాప్ నిర్వాహకులు మహదేవ్ జ్యువెలరీ షాప్ షట్టర్ తెరిచి చూశారు. అక్కడ బుల్లెట్ గాయాలతో పడి ఉన్న కళ్యాణ్, సుఖ్ దేవ్ లను… చికిత్స నిమిత్తం నాగోల్ లోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు…..క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేపట్టారు. కీలక ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలంలో పడి ఉన్న బుల్లెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఘటనాస్థలిని రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు. కాల్పుల జరిగిన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల ఘటనపై 15 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని….. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని , దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Tags

Related News

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: రోజుకి పిడికెడు చాలు.. సూర్యకాంతిలా ప్రకాశిస్తారు!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

Big Stories

×