E-Paper
Advertisement

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా
Advertisement

Hyderabad job mela October 2026: నిరుద్యోగ యువతకు అదిరిపోయే గుడ్ న్యూస్! అక్టోబర్ 10న మాసబ్ ట్యాంక్‌లో  భారీ నాన్-ఐటీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్న ఈ డ్రైవ్‌లో ఫ్రెషర్స్ , అనుభవం ఉన్న అభ్యర్థులు నేరుగా పాల్గొనొచ్చు. ఇంటర్వ్యూ అయిన వెంటనే ఎంపికైన వారికి స్పాట్‌లోనే ఆఫర్ లెటర్స్ అందజేయనున్నాయి కంపెనీలు. ప్రస్తుతం మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ వేదిక సువర్ణావకాశం అందించనుంది. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు..

1. వేదిక, సమయం:

ఈ జాబ్ మేళా మాసబ్ ట్యాంక్ (బంజారాహిల్స్ రోడ్)దగ్గర్లో ఉన్న ఖాజా మెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. కేవలం హైదరాబాద్‌ వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు ఈ డ్రైవ్‌కు హాజరుకావచ్చని నిర్వాహకులు తెలిపారు.

2. పాల్గొంటున్న కంపెనీలు, ఉద్యోగాలు:

Advertisement

ఈ జాబ్ మేళాలో సుమారు 50 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. నాన్-ఐటీ రంగానికి చెందిన వివిధ విభాగాలలో ఖాళీల భర్తీ కోసం కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అర్హులైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్స్ అందించడం ఈ మేళా ప్రత్యేకత.

3. విద్యార్హతలు, అర్హతలు:

ఇంటర్, ఏదైనా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు ఎవరైనా ఈ జాబ్ మేళాకు అర్హులే. గతంలో ఏ సంవత్సరంలో ..పాసైనా సరే, ఫ్రెషర్లతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా హాజరు కావచ్చు.

4. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

Advertisement

ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తగినన్ని కాపీల రెజ్యూమ్‌లను (కనీసం 10 CV కాపీలు) తమ వెంట తెచ్చుకోవాలని

సూచించారు. మరింత సమాచారం కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Related News

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్

Big Stories

Advertisement
×