Palnadu Murder: స్ట్రెచ్చర్‌పై విగతజీవిగా పడి ఉన్న ఈమె పేరు సుజాత. భర్త చనిపోవడంతో పల్నాడు జిల్లా వేల్పూరులో 20ఏళ్లుగా ఒంటరిగా ఉంటుంది. ఈరోజు బంధువుల ఇంట్లో ఫంక్షన్. సుజాత మార్నింగ్ తొందరగా నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చకచక పూర్తి చేసుకుంది. బంధువులతో కలిసి బస్సు ఎక్కింది. కానీ అదే బస్సులో కాలయముడు టికెట్ తీసుకొని బస్సు ఎక్కాడని ఆమె ఊహించలేదు. ఒకడు నక్కి నక్కి ఆమెనే ఫాలో అవుతున్నాడు. ఎక్కడ బస్సు దిగితే అక్కడ దిగాడు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ ముందుకు రాగానే.. ఒక్కసారిగా మీదపడ్డాడు. చేతిలో కత్తి మెరిసింది. వాడు సుజాతపై అదే కత్తితో వేటు మీద వేటు వేశాడు. అడ్డొచ్చిన ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. అరుపులు, కేకలు, రోడ్డంతా రక్తపు మడుగులా మారింది. సుజాత చనిపోగానే వాడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు.
పోలీసులు వెంటనే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రక్తం మడుగులో ఉన్న క్షతగాత్రులను ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి తరలించారు. పరారీలో ఉన్న ఆ కిరాతకుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టింది. రాజుపాలెం మండలం దొంగబ్రాహ్మణపల్లికి చెందిన గోవిందుగా గుర్తించారు పోలీసులు. ఇంతకీ.. ఈ గోవిందు ఎవరు..? సుజాతతో అతడికి ఏంటి సంబంధం..?ఎందుకు ఆమెను మాత్రమే టార్గెట్ చేశాడు..? అసలు ఈ దాడికి ముందు ఏం జరిగింది..? ఇదే ఇప్పుడు పోలీసుల ముందున్న బిగ్ క్వశ్చన్.
పీఎస్ ముందే ఈ మర్డర్ జరగడంతో.. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆ సైకో గాడిని పట్టుకుని లాకప్‌లో వేసి ట్రీట్మెంట్ ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయి.
Also read: పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్..ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అద్భుతమైన రుచి