BigTV English

Hyderabad Metro: మెట్రో టికెట్లపై బ్రేకింగ్ అప్‌డేట్.. మే 17 నుంచే కొత్త చార్జీలు.. ఎంత పెంచారంటే?

Hyderabad Metro: మెట్రో టికెట్లపై బ్రేకింగ్ అప్‌డేట్.. మే 17 నుంచే కొత్త చార్జీలు.. ఎంత పెంచారంటే?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ టికెట్ల ధరలు మారనున్నట్లు అధికారికంగా హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. మెట్రో రైలు (Metro Rail) లో ప్రయాణించే వారు ఈ విషయాన్ని గమనించాలని మెట్రో కోరింది. మే 17, 2025 నుంచి మెట్రో రైల్ టికెట్ ధరలు కొత్త రేట్ల ప్రకారం అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) రూపొందించిన నివేదిక ఆధారంగా ఈ టికెట్ ధరల సవరణ చేసినట్లు మెట్రో ప్రకటన సారాంశం.


కొత్త టికెట్ రేట్ల వివరాలు ఇవే..
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థ నుండి విడుదలైన ప్రకటన ప్రకారం, మొత్తం 34 కిలోమీటర్ల మేర ప్రయాణం 2002లో నిర్ణయించిన టికెట్ ధరల ఆధారంగా జరిగింది. కానీ నేటి పరిస్థితుల్లో ఆ ధరలు అనుసరించడం సాధ్యం కాదు. దాంతో 2022లోనే కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖకు మెట్రో రైల్ సంస్థ నివేదిక సమర్పించగా, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. 2023 జనవరి 25న కమిటీ తన సిఫార్సులను సమర్పించగా, తాజా ప్రకటనలో పేర్కొన్నదాని ప్రకారం మే 17, 2025 నుండి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఈ ధరలు కిలోమీటర్ల దూరాన్ని బట్టి నిర్ణయించబడ్డాయి.

మారిన టికెట్ ధరలు
2 కి.మీ వరకు రూ. 12, 2 – 4 కి.మీ వరకు రూ. 18, 4 – 6 కి.మీ వరకు రూ. 30, 6 – 9 కి.మీ వరకు రూ. 40, 9 – 12 కి.మీ వరకు రూ. 50, 12 – 15 కి.మీ వరకు రూ. 55, 15 – 18 కి.మీ వరకు రూ. 60, 18 – 21 కి.మీ వరకు రూ . 66, 21 – 24 కి.మీ వరకు రూ. 70, 24 కి.మీ పైగా రూ. 75 మెట్రో ఛార్జీలు ఉండనున్నాయి.


ప్రయాణికులకు అవసరమైన సూచనలు..
ఈ మార్పులు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమేనని సంస్థ చెబుతోంది. మెట్రో రైల్ నిర్వహణ, లోగడ ఖర్చులు పెరగడంతో పాటు మెయింటెనెన్స్‌లో కూడా భారీ ఖర్చులు వస్తున్నాయని పేర్కొంది. తాజా ధరల మార్పులు ఆయా అంశాల ఆధారంగా నిర్ణయించినట్లు తెలిపింది. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీ, భద్రత, సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ మార్పులు అవసరమన్నది మెట్రో అధికారుల అభిప్రాయం.

Also Read: Sri Harsha: పెళ్లికి రండి.. స్వయంగా కలెక్టర్ పేరిట ఆహ్వానం.. అసలు విషయం తెలుసా?

ఈ ధరల మార్పులు మీ డైలీ మెట్రో ప్రయాణాన్ని ప్రభావితం చేయవచ్చని, కాబట్టి ముందుగానే ప్లానింగ్ చేసుకొని టికెట్ ధరల చార్ట్‌ ప్రకారం మీ ప్రయాణ వ్యయాన్ని అంచనా వేసుకోవాలని మెట్రో సూచించింది. హైదరాబాదు (Hyderabad) లో మెట్రో ప్రయాణం అత్యంత వేగవంతమైనదిగా, సురక్షితమైనదిగా కొనసాగుతుండగా, ఈ మార్పులు మెరుగైన సేవల లక్ష్యంతో తీసుకున్న నిర్ణయమని భావించాలని కోరింది. పెరిగిన మెట్రో చార్జీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ www.ltmetro.com ను సందర్శించాలని మెట్రో కోరింది.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×