E-Paper
Advertisement

Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్’.. 2,731 మందిపై కేసులు.. పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు

Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ‘కిక్’.. 2,731 మందిపై కేసులు.. పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు
Advertisement

Hyderabad Drunk and Drive: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా బేఖాతరు చేస్తూ, మద్యం మత్తులో వాహనాలు నడిపి వేల సంఖ్యలో అడ్డంగా బుక్కయ్యారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2,731 మంది పట్టుబడ్డారు.

అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్‌లో 928 మంది, మల్కాజ్‌గిరి (రాచకొండ) పరిధిలో 605 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

ఈ తనిఖీల్లో కొన్ని వింత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఫుల్లుగా మందు కొట్టిన ఓ యువకుడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. తనిఖీల్లో పట్టుబడగానే భయంతో పోలీసుల కాళ్లు పట్టుకొని వదలమని ప్రాధేయపడ్డాడు. పోలీసులు అతన్ని సముదాయించి కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా.. పొంతన లేని సమాధానాలతో గందరగోళం సృష్టించాడు.

“నీ పేరేంటి? మీ నాన్న ఏం చేస్తారు?” అని పోలీసులు అడిగితే.. మొదట “నాన్న లేడు” అని చెప్పి, వెంటనే మాట మార్చి “మా నాన్న చైనీస్ పని చేస్తాడు..“ అంటూ అసంబద్ధంగా మాట్లాడాడు. మధ్యలో “మా అమ్మని చూడాలి” అంటూ ఏదేదో వాగాడు. బండి ఎవరిదని అడిగితే అన్నయ్యదని, తండ్రి పేరు ‘రాజేష్ తిర్వా’ అని చెప్పి, ఫోన్ నెంబర్ మాత్రం సగం చెప్పి ఆగిపోయాడు. కనీసం నిలబడలేని స్థితిలో వాహనాలు నడపడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసులకు ఇలాంటి వారు పెద్ద సవాలుగా మారుతున్నారు.

Advertisement

Read Also: న్యూఇయర్ వేళ.. కేవలం ఐదు గంటల్లో రూ. 6 కోట్ల బిర్యానీ సేల్స్, ఇంతకీ ఎక్కడో తెలుసా?

Related News

మీ బాధలో మేమున్నూ.. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మైసూరు దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి సన్నిధిలో ప్రత్యేక పూజలు!

దసరా ట్రిప్‌కి వెళ్లొచ్చేసరికి దారుణం.. కుషాయిగూడలో 30 తులాల బంగారం చోరీ!

నీటిని వృథా చేయవద్దు.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి: సీతక్క

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

సాహిల్ ఫుడ్స్‌పై TG SAFE దాడులు.. 55 టన్నుల ఫుడ్ సీజ్!

తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పుల వేళ.. సరిదిద్దుకోకపోతే దెబ్బే?

Big Stories

Advertisement
×