BigTV English

Hyderabad: శివరాత్రి రోజు పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై దాడులు.. పోలీసులు తగ్గేదేలే..

Hyderabad: శివరాత్రి రోజు పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై దాడులు.. పోలీసులు తగ్గేదేలే..

Hyderabad: శివరాత్రి. దేశమంతా భక్తిపారవశ్యంలో మునిగి ఉంది. శివనామస్మరణతో ఊరూ వాడా మారుమోగిపోతోంది. ఎటు చూసినా ఓం నమ:శివాయ వినిపిస్తోంది. ఇలా ఓవైపు మెజార్టీ ప్రజలు భక్తి మార్గంలో ఉండగా.. హైదరాబాద్ లో కొందరు పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లలో మందేస్తూ చిందేస్తున్నారు. అందులో పలువురు మైనర్లు కూడా ఉన్నారు. వారికి శివరాత్రి లేదూ పాడు లేదు. వీకెండ్ అంటూ ఫుల్ గా చిల్ అవుతున్నారు. కానీ, ఎందుకోగాని పోలీసులు పండగ పూట కొన్ని పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై సడెన్ గా దాడులు చేశారు. మీ సంగతేంటంటూ పోలీస్ యాక్షన్ స్టార్ట్ చేశారు.


హైదరాబాద్‌లోని 16 పబ్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు పబ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు మద్యం సరఫరా చేసినట్టు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హాట్‌ కప్‌, బర్డ్‌ బాక్స్‌ పబ్‌లపై కేసులు నమోదు చేశారు. మైనర్లకు మద్యం సరఫరా చేసినందుకు హాట్‌ కప్‌ పబ్‌పై.. లైసెన్సు లేకుండా పబ్‌ నిర్వహిస్తున్న బర్డ్‌ బాక్స్‌ పబ్‌పై కేసు ఫైల్ చేశారు.

పబ్ ల మీదే కాదు ఫామ్‌హౌజ్‌లపైనా తఢాఖా చూపించారు పోలీసులు. అనుమతి లేకుండా ఫామ్‌హౌజ్‌లోకి మద్యం తీసుకెళ్లినందుకు మొయినాబాద్‌లోని సెలబ్రిటీ, ఎటెర్నిటీ, ముషీరుద్దీన్ ఫామ్‌హౌజ్‌లపై కేసులు నమోదు చేశారు. ఇటీవలే ఓ 32 ఫాంహౌజ్ లపై అటాక్ చేసి.. నాలుగింటిలో జూదం, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి వాటిని సీజ్ చేశారు. 22 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు మరోసారి ఫామ్ హౌజుల్లో తనిఖీలు చేసి మూడింటిపై కేసులు పెట్టారు.


వరుసబెట్టి పబ్ లు, ఫామ్ హౌజ్ లపై తనిఖీలు చేస్తున్న పోలీసులను నగరవాసులు అభినందిస్తున్నారు. పండుగ పూట కూడా డ్యూటీ చేస్తూ.. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. శభాష్ పోలీస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×