BigTV English

Another Case on Radhakishanrao: మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు దెబ్బ మీద దెబ్బ.. ఇప్పుడు ఫ్లాట్ వంతు..!

Another Case on Radhakishanrao: మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు దెబ్బ మీద దెబ్బ.. ఇప్పుడు ఫ్లాట్ వంతు..!

Hyderabad police Another case register on ex task force dcp Radha kishan rao


Another case on Radha Kishan Rao: కాలం కలిసి రాకపోతే అన్ని రివర్స్ అవుతాయి. ప్రస్తుతం టాస్క్‌ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు పరిస్థితి కూడా అలాగే తయారైంది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేశారు కూకట్‌పల్లి పోలీసులు. ఈసారి ప్లాటు సేల్ డీడ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు కట్టేయడం పోలీసుల వంతైంది.

కూకట్‌పల్లిలోని విజయనగర కాలనీకి చెందిన 52 ఏళ్ల సుదర్శన్ కుమార్ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు. అయితే ఆయన ఫ్రెండ్స్ ఎంవీ రాజు, ఏవీకె విశ్వనాధరాజు తమకు చెందిన కన్ స్ట్రక్షన్ కంపెనీలో పెట్టుబడులు పెడితే 10శాతం వాటా ఇస్తామని ఆయనకు సూచన చేశారు. ఈ క్రమంలో కొంత నగదు చెల్లించాడు సుదర్శన్. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట సనత్‌నగర్‌లోకి ఓ అపార్టుమెంట్ వారికి ఇచ్చారు సంబంధిత వ్యక్తులు.


Also Read : తెలంగాణ వాసులకు కూల్ న్యూస్.. ఈ నెలలోనే వర్షాలు

ఇంతవరకు కథ బాగానే నడిచింది. అసలు స్టోరీ అక్కడి నుంచే మొదలైంది. ఆ ఫ్లాటును బిజినెస్‌మేన్ సుదర్శన్ తన కూతురి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. పైగా అందులోనే ఉంటున్నాడు కూడా. రెండు నెలల తర్వాత ఒకరోజు సుదర్శన్‌కు ఎంవీ రాజు నుంచి ఫోన్ వచ్చింది. ఫ్లాట్ ఇచ్చినందుకు అదనంగా ఐదు లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ వ్యవహారం అప్పటి టాస్క్‌ఫోర్స్ పోలీసుల వరకు వెళ్లింది.

సుదర్శన్‌ను సికింద్రాబాద్‌లోని తమ ఆఫీసుకు తీసుకెళ్లారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. రెండురోజులు అక్కడే నిర్భంధించి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ క్రమంలో అప్పటి డీసీపీ రాధాకిషన్‌రావు ఎంట్రీ ఇచ్చారు. ఫ్లాట్ ఖాళీ చేయకుంటే ఫ్రెండ్ రాజు చంపేస్తాడని బెదిరించాడు. దీంతో సుదర్శన్ చేత బలవంతంగా ప్లాట్ సేల్ డీడ్ రద్దు చేయించారు.

ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సుదర్శన్.. ఫోన్ ట్యాపింగ్ విషయాలు వెలుగులోకి రావడం మాజీ డీసీపీ అరెస్టు చేయడం వంటి పరిణామాలను గమనించాడు. రాధాకిషన్‌రావుపై ఫిర్యాదు చేయడానికి ఇదే టైమ్ అనుకుని భావించి.. జరిగిన తతంగాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయడం పోలీసుల వంతైంది. రాబోయే రోజుల్లో మాజీ డీసీపీ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వేధించిన ఆకతాయిలు.. అక్కడ తాకేందుకు ప్రయత్నం..

Medak Flood: మెదక్ రామాయంపేటలో వరద ఆందోళన.. హాస్టల్‌లో చిక్కుకున్న 400 విద్యార్థులు

Big Stories

×