E-Paper
Advertisement

Girl Friend revenge in Drugs Case | బాయ్‌ఫ్రెండ్‌పై ప్రియరాలి పగ.. గంజాయి కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు!

Girl Friend revenge in Drugs Case | ప్రియుడు తనను మోసం చేశాడని ఓ యువతి అతడిపై పగ పెంచుకుంది. కుట్ర పన్ని అతడిని ఒక పోలీస్ కేసులో ఇరికించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.

Girl Friend revenge in Drugs Case | బాయ్‌ఫ్రెండ్‌పై ప్రియరాలి పగ.. గంజాయి కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు!
Advertisement

Girl Friend revenge in Drugs Case | ప్రియుడు తనను మోసం చేశాడని ఓ యువతి అతడిపై పగ పెంచుకుంది. కుట్ర పన్ని అతడిని ఒక పోలీస్ కేసులో ఇరికించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని రహమత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రింకీ అనే యువతి.. అమీర్ పేట్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సరూర్ నగర్‌లో నివాసముంటున్న శ్రవణ్ అనే యువకుడు కూడా అమీర్ పేట్‌లోనే పనిచేస్తున్నాడు. అక్కడ వీరిద్దరికీ పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత శ్రవణ్ ఆమెను పట్టించుకోవడం మానేశాడు.

Advertisement

శ్రవణ్ వ్యవహారం రింకీకి నచ్చలేదు. దీంతో అతనిపై పగ పెంచుకుంది. అతడిని జైలు పంపిచాలని కుట్ర చేసింది. దీనికోసం మంగళ్‌హాట్‌ ప్రాంతం నుంచి 40 గ్రాములు గంజాయి కొనుగోలు చేసింది. ఆ గంజాయిని 5 ప్యాకెట్లుగా చేసింది. ఆ తరువాత తన ఫ్రెండ్స్‌తో శ్రవణ్‌కు ఫోన్ చేయించి ఒక చోటకు పిలిపించింది. ఆ తరువాత శ్రవణ్‌, రింకీ, ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు రింకీ ఫోన్ చేసింది. శ్రవణ్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. శ్రవణ్ కారు నెంబర్ చెప్పి.. ఆ కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది.

పబ్ వద్దకు పోలీసులు చేరుకొని కారును తనిఖీ చేయగా.. గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేసి.. విచారణ చేశారు. విచారణలో శ్రవణ్ ఆ కారు తనది కాదు అని.. రింకీ ఫ్రెండ్స్‌తో ఆ కారు వచ్చినట్లు తెలిపాడు. పోలీసులు ఆ కారులో వచ్చిన వారందరినీ విచారణ చేశారు.

Advertisement

దీంతో రింకీనే ఇదంతా చేయించిందని ఆమె ఫ్రెండ్స్ తెలిపారు. తమ చేత ఫోన్ చేయించి శ్రవణ్‌ని పిలిపించిందని.. ఆ తరువాత అతను కారులో తమతో వచ్చాడని తెలిపారు. పోలీసులకు రింకీపై అనుమానం కలిగింది. ఆమెను గట్టిగా విచారణ చేయగా.. అసలు విషయం బయటపడింది. శ్రవణ్‌పై కక్షతోనే రింకీ ఈ పని చేసిందని పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రింకీ, ఆమె స్నేహితులను అరెస్టు చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×