BigTV English

Hyderabad : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా? ఈ డీటైల్స్ చూస్తే షాకే..

Hyderabad : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా? ఈ డీటైల్స్ చూస్తే షాకే..

Hyderabad : రెడీ అయ్యామా.. బండి తీశామా.. రయ్‌ మంటూ దూసుకెళ్లామా.. ఇంతేనా? ట్రాఫిక్ రూల్స్ పట్టవా? పక్క వారిని చూసి నేర్చుకోరా? పోలీసులు అంటే భయం లేదా? చట్టాలంటే గౌరవం లేదా? కనీసం, ప్రాణాల మీదైనా ఆశ లేదా? ఈ జనాలకు ఏమైంది? కొందరు తప్పతాగి బండి నడుపుతుంటారు. హెల్మెట్ పెట్టుకోరు. సీట్ బెల్ట్ ఫిక్స్ చేయరు. రాంగ్ రూట్‌లో దుసుకెళ్తుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోరు. వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటారు. ఇవన్నీ రూల్స్‌కు విరుద్ధమే. ప్రాణాలతో చెలగాటమే. ఎంతెంత ఫైన్లు వేసినా కొందరిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. డ్రంకెన్ డ్రైవ్‌లో జైలుకు వెళ్తున్నా భయపడటం లేదు. చలాన్లు వేస్తే వేసుకో.. కడితే కడతా.. లేదంటే డిస్కౌంట్ ఇచ్చినప్పుడు చూద్దాంలే అంటున్నారు. అలా ఏటికేడాది ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో రూల్స్ బ్రేక్ చేసిన కేసులు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్‌గా ఆ వివరాలన్నీ చెప్పాలంటూ RTI కింద అడిగితే.. పోలీసులు రిలీజ్ చేసిన డేటా మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.


పెరిగిన కేసులు.. భారీగా చలాన్లు..

గతేడాది 2024లో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు 25.5 లక్షల చలాన్లు వేశారు. ఇది అంతకుముందు ఏడాదిలో పోల్చితే చాలా ఎక్కువ. 2023లో 19.1 లక్షల చలాన్లు వేస్తే.. 2024లో ఏకంగా 25.5 లక్షల చలాన్లు వేశారు. ఇక, హెల్మెట్‌కు ఉండే పట్టీలను సరిగ్గా బిగించనందుకు మరో 1,333 కేసులు నమోదయ్యాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు 2024లో 4.37 లక్షలు ఉన్నాయి. అయితే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చలాన్లలో తగ్గుదల కనిపించింది. ఇందులో ఫోర్ వీల్ వాహనాలకంటే టూ వీలర్స్‌పైనే ఎక్కువ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ డివైడర్లు, బారికేడ్లు పెట్టడం వల్ల కావొచ్చు ఈ కేసుల్లో తగ్గుదల కనిపించింది. మనోళ్లు మారడం వల్ల కాకపోవచ్చు. మరోవైపు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన కేసులు 48శాతం పెరిగి 86,048 చలాన్ల జారీ అయ్యాయి. మైనర్లు వాహనాలు నడిపిన కేసులు 3,281 నమోదయ్యాయి. స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ కేసులు 30 ఫైల్ అయ్యాయి. డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో 22,300 చలాన్లు విధించారు. RTC బస్సులలో ఫుట్‌బోర్డింగ్ చేస్తున్నారని 245 కేసులు పెట్టారు. ఇవన్నీ ఒక్క ఏడాదిలో నమోదైన కేసులే. అదికూడా కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనివే. ఇక సైబరాబాద్‌తో పాటు రాష్ట్రం అంతా చూస్తే ఇలాంటి కేసులు సంఖ్య భారీగా ఉంటుంది.


రూల్స్ అంటే భయంలేదా?

ట్రాఫిక్ నిబంధనలు స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నామని పోలీసులు ఎంతగా చెబుతున్నా.. వాళ్ల ఫోకస్ అంతా చలాన్లు బాదుడు మీదే ఉందనే ఆరోపణ కూడా ఉంది. సీసీకెమెరాలు ఉన్న చోట్ల కాస్త బెటర్. అవి లేవని తెలిస్తే వాహనదారులు రెచ్చిపోతున్నారు. నెంబర్ ప్లేట్స్‌ను వంచేసి, నెంబర్లు చెరిపేసి రకరకాలుగా ఫైన్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూల్స్ ఫాలో అయ్యే వాళ్లు చాలామందే ఉన్నా.. వాటిని పాటించని వాళ్ల వల్లే ప్రమాదాలు. రూల్స్ బ్రేకర్స్ చెలగాడం.. మిగతా వారికి ప్రాణసంకటంగా మారిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినా మారితేగా?

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×