Rana Naidu Season 2: టాలీవుడ్ నటుడు రానా లీడర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఈయన మాత్రం కెరియర్ పరంగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడటం లేదు. బాహుబలి(Bahubali) సినిమాలో ఈయన విలన్ పాత్ర ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇలా కథ ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా రానా సిద్ధంగా ఉన్నారు.
రీ ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప…
ఇలా సినిమాలు మాత్రమే కాకుండా ఈయన వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి “రానా నాయుడు”అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఈయన “రానా నాయుడు సీజన్ 2” (Rana Naidu Season 2)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్(Net Flixs) లో ప్రసారం అవుతుంది. అయితే తాజాగా ఈ సీజన్ కి సంబంధించిన ఒక వీడియోను నెట్ ఫ్లిక్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈ సీజన్ లోకి బాహుబలి కట్టప్ప(Kattappa) రీ ఎంట్రీ ఇవ్వడం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.
వేల సంవత్సరాలైనా ప్రవర్తన మారలేదు..
ఇలా ఈ వీడియోలో రానా, కట్టప్ప మధ్య జరిగిన సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇక కట్టప్ప పాత్రలో నటుడు సత్యరాజ్ ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ఈయన ఈ సిరీస్ లోకి కూడా కట్టప్ప గెటప్ లో రావటం విశేషం. రానా నిద్రపోతూ తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నట్టు కలకంటూ ఉండగా ఒక్కసారి మెలకువ రావడంతో నటుడు సత్యరాజ్ కట్టప్ప గెటప్ లో రానా ముందు కనిపించడంతో రానా కట్టప్ప అంటూ పలకరిస్తాడు. వెంటనే కట్టప్ప హాయ్ ప్రభు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన మీ వస్త్రధారణలో మార్పు వచ్చింది కానీ ఈ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదని చెబుతాడు.
కుటుంబం కోసం జీవితాన్ని ఇచ్చాడు…
ఇలా తన కుటుంబంలో ఎన్నో గొడవలు ఉన్నాయని రానా చెబుతాడు అలాంటి గొడవలు మీకు ఉంటే నువ్వు అసలు నిద్రపోవని చెప్పగా, ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురిని హ్యాండిల్ చేయలేకపోతున్నావు అప్పట్లో మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలా చూసుకున్నావు అనగా నేనేం చేసినా కుటుంబం కోసమే చేస్తున్నానని చెబుతాడు. బాహుబలి కుటుంబం కోసం తన జీవితాన్ని ఇచ్చేశాడనీ చెబుతుండగా రానా మాత్రం హద్దులు దాటొద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటకు నువ్వు మీ నాన్నతో కలిసి ఎప్పుడో హద్దులు దాటావు అంటూ బాహుబలి సంఘటనల గురించి మరోసారి ఇద్దరి మధ్య జరిగిన సంఘటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య కుటుంబం గురించి, కుటుంబ రక్షణ గురించి జరిగిన సంభాషణకు సంబంధించిన ఈ వీడియోని ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ షేర్ చేయటంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.