SRH -Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} లోని ఓ ప్రాంచైజీ ఐన సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కి తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ లో ఎస్.ఆర్.హెచ్ ఒకటి. ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ వంటి యువ క్రికెటర్ల నుంచి క్లాసెన్, ప్యాట్ కమీన్స్, మహమ్మద్ షమీ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ల వరకు చూసుకుంటే.. ఈ జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది.
ఇక ఈ జట్టు సీఈవో కావ్య మారన్ సైతం నిత్యం తన జట్టు సభ్యులను సపోర్ట్ చేస్తూ ఉంటారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుని 2012లో సన్ టీవీ నెట్వర్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసింది. ఆ డీల్ వాల్యూ అప్పట్లో 158 మిలియన్ డాలర్లు. ఇక అప్పటినుండి ఈ ఐపీఎల్ జట్టు నెట్ వర్త్ పెరుగుతూ వచ్చింది. ఈ జట్టు విలువ ఇప్పుడు 700 కోట్లకు పైగా ఉంది. అయితే ఈ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ద్వారా కావ్య మారన్ ఎలా సంపాదిస్తున్నారు అనే విషయానికి వస్తే..
SRH ద్వారా కావ్య మారన్ సంపాదన:
మొదట బీసీసీఐ నుండి ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసి దానికి సన్ రైజర్స్ హైదరాబాద్ అనే పేరుని ఖరారు చేసింది కావ్య. కానీ ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుని కొనాలంటే బీసీసీఐ వ్యాల్యూ ప్రకారం దీని విలువ 750 కోట్లు. ఈ సంవత్సరం కేవలం ఆటగాళ్ల కొనుగోలు కోసమే 120 కోట్లను ఖర్చు చేసింది కావ్య. అది రిటైనర్ ప్లేయర్స్ అయినా అవ్వచ్చు, లేక కొత్త ఆటగాళ్లయినా కావచ్చు. ఆ తరువాత కోచింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఉంటారు. వారికి ఒక 20 కోట్ల వరకు ఖర్చు చేస్తారు.
ఇక ఐపీఎల్ ప్రారంభం అయ్యాక ట్రావెల్ ఖర్చులు, ఫుడ్, వెకేషన్, ఇతర ఖర్చులు మరో 10 కోట్లు. అయితే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో ప్రతి మ్యాచ్ కి 1.5 కోట్లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇలా హోమ్ గ్రౌండ్ లో ఏడు మ్యాచ్ లు ఉంటాయి. ఈ ఏడు మ్యాచ్ లకి కలిపి 10.5 కోట్లు స్టేడియం రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఇలా ఐపీఎల్ లోని అన్ని ఫ్రాంచైజీలు స్టేడియంకి రెంట్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఒక రెండు జట్టులకి మాత్రం వీటి నుండి మినహాయింపు ఉంటుంది.
ఆ జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్లు స్టేడియం కి రెంట్ కట్టకుండా టికెట్ షేరింగ్ చేస్తారు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విలువ 750 కోట్లు.. ఇది కాకుండా స్టాఫ్ కి 20 కోట్లు, ట్రావెల్ అండ్ ఫుడ్ కి 10 కోట్లు, స్టేడియం రెంట్ 10 కోట్లు కలిపి 800 కోట్లు. అయితే ఈ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్ గెలిస్తే వచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. మరి మిగతా 780 కోట్లు ఎలా సంపాదిస్తారంటే.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు {ఉప్పల్} స్టేడియం కెపాసిటీ 39,000. ఇందులో టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు ప్రతి మ్యాచ్ కి కనీసం ఆరు కోట్లు ఉంటుంది.
అంటే ఏడు మ్యాచ్ లకి కలిపి 42 కోట్లు. ఇందులో 80% డబ్బు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి పోగా మిగతా 20% లోకల్ క్రికెట్ అసోసియేషన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక స్టేడియంలో అమ్మే ఫుడ్ ఐటమ్స్ వాటి నుండి వచ్చే ఫుల్ అమౌంట్ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకే దక్కుతుంది. ఇది ఒక మ్యాచ్ కి 50 లక్షల వరకు వసూల్ అవుతుంది. ఇలా ఏడు మ్యాచ్ లకి కలిపి 3.5 కోట్లు. అలాగే కొన్ని బ్రాండ్స్ తో డీల్ చేసుకొని ప్లేయర్స్ తో యాడ్స్ చేయిస్తారు. ఇందులో ఎక్కువ శాతం డబ్బు ఫ్రాంచైజీ తీసుకుంటుంది. ఈ యాడ్స్ లో నటించిన ప్లేయర్స్ కి కొంత డబ్బు ఇస్తారు.
అంతేకాకుండా ప్లేయర్స్ డ్రెస్ మీద ఉండే లోగో నుండి కూడా డబ్బులు వస్తాయి. ఉదాహరణకి అభిషేక్ శర్మ జెర్సీ అమ్మకాల ద్వారా.. ఆ ప్లేయర్ కి ఎటువంటి లాభం ఉండదు. ఇది కేవలం ఫ్రాంచైజీకే లాభం చేకూరుతుంది. అలాగే బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ లో కొంత అమౌంట్ బిసిసిఐ అన్ని ఫ్రాంచైజీలకి పంచుతుంది. అలా కూడా కొంత డబ్బు దక్కుతుంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ లోగో తో కొన్ని వస్తువులను మార్కెట్ లో విక్రయిస్తారు. వీటి ద్వారా కూడా లాభం చేకూరుతుంది.
ఇవి మాత్రమే కాకుండా ఐపిఎల్ ముగిసిన తర్వాత బీసీసీఐకి వచ్చిన లాభాన్ని లెక్కేసుకొని అందులో కూడా కొంత డబ్బుని అన్ని ఫ్రాంచైజీలకు పంచుతారు. ఇది ఓ జీతం లాంటిది. ఇది ఆ సీజన్ లో జట్టు ఆట తీరుతో సంబంధం లేకుండా డబ్బు చేతిలోకి వస్తుంది. ఇన్ని విధాలుగా సన్రైజర్స్ హైదరాబాద్ కి ఆదాయం లభించి చివరికి 150 కోట్ల నుండి 180 కోట్ల వరకు ప్రతి ఏడాది లాభం చేకూరుతుంది. ఇలా ఇప్పటికిప్పుడు ఎవరైనా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును 800 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. ఈ 800 కోట్లను సంపాదించుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఆ తరువాత 6వ సంవత్సరం నుండి లాభాలు చవిచూడవచ్చు.