BigTV English

Police raids on Pubs: జూబ్లీహిల్స్‌ జోరా‌ పబ్‌లో డ్రగ్స్‌ కలకలం, పోలీసుల దాడులు

Police raids on Pubs: జూబ్లీహిల్స్‌ జోరా‌ పబ్‌లో డ్రగ్స్‌ కలకలం, పోలీసుల దాడులు

Police raids on Pubs(Hyderabad latest news): డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై పోలీసులు ఎక్క డికక్కడ నిఘా పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పబ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పైకి పబ్‌గా కనిపిస్తు న్నా, రాత్రి వేళ మాత్రం డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సినీ సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొన్ని పబ్స్ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.


ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని జోరా‌పబ్‌లో అర్థరాత్రి వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతోంది. దీని గురించి పోలీసులకు సమాచారం వెళ్లింది. నార్కోటిక్‌- పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈవెంట్‌ కు వచ్చినవారు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారంతో సోదాలు చేశారు.

ఈవెంట్‌లో పాల్గొన్నవారికి డ్రగ్స్ టెస్ట్ చేయించారు. అందులో నలుగురికి పాజిటివ్ వచ్చింది. వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎవరిచ్చారు? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై కూపీ లాగీ పనిలోపడ్డారు.


ALSO READ: అత్తాపూర్‌ లో భూకబ్జా గ్యాంగ్ అరెస్ట్, మారణాయుధాలు స్వాధీనం..

ఇదికాకుండా దుర్గం చెరువు సమీపంలోని ఓ పబ్‌లోనూ పోలీసులు సోదాలు చేసినట్టు వార్తలు వస్తున్నా యి. అందులో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు దొరికారా? లేదా అన్నది తెలియాల్సివుంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

 

Related News

PC Ghosh Commission: అందుకే ఇదంతా.. మేడిగడ్డ కుంగుబాటు అసలు కారణం ఇదే: KCR

Rain Alert: బిగ్ అలర్ట్! మరో 3 రోజులు కుండపోత వర్షాలు.. ఎవరు బయటకు రావొద్దు..

Marwadi Controversy: మర్వాడీస్ రచ్చ.. అసలు కారణాలు ఇవే! ఎక్కడిదాకా వెళ్తోంది?

Lady Aghori: లేడీ అఘోరీ కాశీకి.. వర్షిణి ఇక అంతేనా? బయటికి వచ్చిన శ్రీనివాస్ కొత్త ప్లాన్స్ ఏమిటి?

Hyderabad crime: మహిళతో కుదరని యవ్వారం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. కేపీహెచ్‌బీలో గ్యాంగ్ కలకలం!

Rajanna Sirisilla news: అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సుగంధ పట్టుచీర.. వేములవాడ అమ్మవారికి అరుదైన కానుక!

Big Stories

×