E-Paper
Advertisement

నాచారంలో భారీ గంజాయి సీజ్.. 60.380 కిలోలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

నాచారంలో భారీ గంజాయి సీజ్.. 60.380 కిలోలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్
Advertisement

Hyderabad Police Seize: హైదరాబాద్‌లో పోలీసులు మరో భారీ గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి గుట్టుచప్పుడు కాకుండా నగరానికి తరలిస్తున్న సుమారు రూ.30 లక్షల విలువైన ఎండు గంజాయిని పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు.

నాచారంలో మెరుపు దాడి

Advertisement

ఎస్‌ఓటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసులకు అందిన పక్కా సమాచారంతో నాచారం ఐడీఏ వద్ద నిఘా పెట్టారు. అక్కడ స్టెర్లింగ్ షూస్ కంపెనీ సమీపంలో వెళ్తున్న నీలిరంగు ఫియట్ లీనియా కారు (MH01BK9751)ను పోలీసులు అడ్డగించారు. తనిఖీ చేయగా కారు డిక్కీలో 60 ప్యాకెట్లలో దాచిన 60.380 కిలోల గంజాయి బయటపడింది. దీంతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్‌కు వాడిన 60 ఖాళీ టేప్ కవర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్, ముంబైకి ప్లాన్

Advertisement

పోలీసుల విచారణలో ఈ ముఠా వ్యవహారం ఆసక్తికరంగా ఉంది. బెర్హంపూర్ నుంచి కారులో ఈ సరుకును హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తేలింది. ఒడిశాలో కిలో గంజాయిని సుమారు రూ.2 వేలకే కొనుగోలు చేసి.. హైదరాబాద్‌తో పాటు ముంబైలో అధిక ధరకు అమ్మాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్రిప్‌కు రూ.8 వేల ఆశ.. ఇద్దరు పరారీ

గ్యాంగ్‌లోని వాళ్లకు ఒక్కో ట్రిప్ వేస్తే రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఇస్తామని ఆశ చూపి ఈ రవాణా చేయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చిక్కగా.. ఈ దందా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారు రాహుల్ అలియాస్ కృష్ణ, మరో నిందితుడు అజయ్ సాగర్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెట్‌వర్క్ మూలాలు, ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ కొనసాగుతోంది.

Also Read: తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: పొన్నం ప్రభాకర్

Tags

Related News

తెలంగాణ ఏఐసీసీ నూతన ఇన్‌ఛార్జ్ మొదటి ప్రసంగం.. ఏమన్నారంటే..?

తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: పొన్నం ప్రభాకర్

ఓట్ల తొలగింపుపై పోరు, కరువు నిధుల కోసం డిమాండ్.. పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ అప్డేట్.. కొత్త మంత్రులుగా వీరికి అవకాశం?

రూ.40.96 కోట్ల వరి స్కామ్.. రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.30 లక్షల నగదు సీజ్!

నమ్మిన సంస్థకే నామంపెట్టిన అడ్మిన్ ఎగ్జిక్యూటివ్.. రూ.4.19 కోట్లు స్వాహా!

‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!

Big Stories

Advertisement
×