E-Paper
Advertisement

ఓట్ల తొలగింపుపై పోరు, కరువు నిధుల కోసం డిమాండ్.. పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఓట్ల తొలగింపుపై పోరు, కరువు నిధుల కోసం డిమాండ్.. పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Revanth Reddy: గాంధీ భవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన మాటలతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా కొత్త ఇంచార్జ్ బీఎం సందీప్‌కు స్వాగతం పలికారు. అనంతరం గతంలో ఇంచార్జ్‌గా పనిచేసిన మీనాక్షి నటరాజన్ హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం, మునిసిపల్ ఎన్నికల్లో 85 శాతం సీట్లు గెలిచామని చెబుతూ ఆ టీమ్ కృషికి కృతజ్ఞతలు తెలిపారు. వంద ఏళ్ల తర్వాత తెలంగాణలో ఓబీసీ కులగణన చేశామన్నారు. ఇప్పుడు కేంద్రం 2027లో చేపట్టబోయే జనగణనలోనూ ఓబీసీ కులగణన చేర్చాలని తీర్మానం చేయాలన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సూచించారు.

ఎల్ నినో ముప్పు.. నీటి కష్టాలపై హెచ్చరిక

Advertisement

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గి చాలా దేశాలు, పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఇబ్బంది పడుతున్నాయని సీఎం చెప్పారు. రైతులు తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. వానాకాలంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా తట్టుకుని పంటలను కాపాడమన్నారు. ఆహార ధాన్యాలకు కొరత లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎనిమిది నెలలు తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టుల్లోని నీటిని వాడుకోవాలన్నారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కోవడానికి రూ.30 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు.

ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆందోళన

Advertisement

ఓట్ల తొలగింపు అంశంపై రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. దేశంలో కోట్ల ఓట్లను తొలగిస్తున్నారన్నారు. తెలంగాణలోనే 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళల ఓట్లపై దెబ్బ పడుతోందని, ఇది దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులను తయారు చేసే ప్రయత్నమని విమర్శించారు. వందేళ్ల క్రితం సైమన్ కమిషన్ వచ్చినట్టు ఇప్పుడు ఇది వచ్చిందన్నారు. ‘జ్ఞానేష్ కుమార్ గో బ్యాక్’ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలని, ఐదు నెలల పాటు ‘ప్రజా బలం’ కార్యక్రమంతో ప్రతి గ్రామానికి వెళ్లాలని చెప్పారు.

ఆఫ్ ది రికార్డ్‌లో ఏపీ ప్రాజెక్టులపై కౌంటర్

ఆఫ్ ది రికార్డ్ మాటల్లో పార్టీ క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు. మంచిని మైక్‌లో చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలంటూ కార్యకర్తలకు సూచించారు. ఇక ఏపీ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. 2022లోనే పల్నాడు వాటర్ గ్రిడ్, జల్ జీవన్ మిషన్ జీవోలు, పోతిరెడ్డిపాడు అంశాలు మొదలయ్యాయని, కేసీఆర్ 299 టీఎంసీలపై సంతకం చేయడం వల్లే ఆంధ్రలో ప్రాజెక్టులు వచ్చాయన్నారు. తాము వచ్చాక ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని స్పష్టం చేశారు.

Also Read: సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!

Tags

Related News

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై బిగ్ అప్డేట్.. కొత్త మంత్రులుగా వీరికి అవకాశం?

రూ.40.96 కోట్ల వరి స్కామ్.. రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.30 లక్షల నగదు సీజ్!

నమ్మిన సంస్థకే నామంపెట్టిన అడ్మిన్ ఎగ్జిక్యూటివ్.. రూ.4.19 కోట్లు స్వాహా!

‘కూతుళ్లు వద్దు.. కొడుకు కావాలి’.. భార్యకు ఫోన్ మెసేజ్‌తో తలాక్ చెప్పిన భర్త!

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మృతి

రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

గులాబీ కొత్త వ్యూహం.. రంగంలోకి సర్వే టీమ్స్.. ప్రజా నాడి పట్టేందుకు నయా స్కెచ్!

Big Stories

Advertisement
×