E-Paper
Advertisement

గచ్చిబౌలి పబ్బుల్లో ఈగల్ టీమ్ తనిఖీలు.. మహిళా ఐఏఎస్ కుమారుడికి డ్రగ్ పాజిటివ్

గచ్చిబౌలి పబ్బుల్లో ఈగల్ టీమ్ తనిఖీలు.. మహిళా ఐఏఎస్ కుమారుడికి డ్రగ్ పాజిటివ్
Advertisement

గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని పబ్బులపై ఈగల్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఎరీనా పబ్ వేదికగా జరిగిన ఈ సోదాలు నగరంలో కలకలం రేపాయి. డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పబ్‌లోని ప్రతి ఒక్కరినీ క్లియర్ కట్ గా తనిఖీ చేశారు. అనుమానితులకు అక్కడికక్కడే డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎనిమిది మందికి డ్రగ్ పాజిటివ్.. 

Advertisement

ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 64 మందికి అధికారులు పరీక్షలు చేశారు. వీరిలో ఎనిమిది మందికి డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. పట్టుబడ్డ వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు ఉండటం గమనార్హం. అకెళ్ల హరిత్ సారంగ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతనితో పాటు మరికొందరు యువకులు మాదకద్రవ్యాలు సేవించినట్లు ఈగల్ టీమ్ నిర్ధారించింది. ఐఏఎస్ అధికారి కుమారుడు కావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారి పేర్లు..

Advertisement

క్వాక్ ఎరీనా పబ్‌లో పట్టుబడ్డ వారి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించారు. రితేష్, జ్యోతి రాదిత్య, రిత్విక్ వాసాల, అభిషేక్ వర్మ, అకెళ్ల హరిత్ సారంగ, రిషబ్ శ్రీవాత్సవ, పిట్ల పృథ్వి రాజ్, మోనిష్ సత్వానీలకు డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో తేలింది. వీరందరిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. గచ్చిబౌలి పరిసరాల్లోని పబ్బులు డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు.. 

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలోని పబ్బులపై ప్రత్యేక నిఘా ఉంచారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఈగల్ టీమ్ నిరంతరం సోదాలు నిర్వహిస్తోంది. పట్టుబడ్డ నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పబ్ నిర్వాహకుల పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే పబ్బుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

ALSO READ: రూ.80 లక్షల జీతం, అమెరికాలో ఇల్లు.. అయినా టెక్కీ జంట సూసైడ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Related News

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×