E-Paper
Advertisement

విహారయాత్రలో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!

విహారయాత్రలో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!
Advertisement

School Picnic Tragedy: నార్సింగిలోని హ్యాపీ స్కాలర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా మొయినాబాద్ లోటస్ పాండ్ పార్కుకు విహారయాత్రకు వెళ్లారు. స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటూ.. ఆనందంగా గడపాల్సిన ఆ క్షణాల్లో ఊహించని పెను విషాదం చోటుచేసుకుంది. తోటి పిల్లలంతా కేరింతలు కొడుతుండగా, పార్కులో వేగంగా ఊగుతున్న ఒక ఉయ్యాల వెనుక నిల్చున్న ఇద్దరు విద్యార్థులను ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది.

ఆసుపత్రిలో మరో విద్యార్థి

Advertisement

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 4వ తరగతి విద్యార్థి తమ్ము అభిరామ్ (10) దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ఉయ్యాల తగిలి గాయపడిన 12 ఏళ్ల యశ్వంత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. కళ్లముందే ఆడుకుంటున్న తోటి విద్యార్థి విగతజీవిగా మారడంతో తోటి పిల్లలు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆనందంగా పిక్నిక్‌కు పంపించిన తమ కుమారుడు ఇక లేడన్న వార్త తెలియడంతో అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

Also Read: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సోదరుడిపైనా కేసు నమోదు!

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సోదరుడిపైనా కేసు నమోదు!

తెలంగాణ ఇన్‌ఛార్జ్ సందీప్‌‌తో రాజగోపాల్‌-అనిరుధ్ భేటీ.. చర్యలు తప్పవు, పదవులు దూరం చేసుకోవద్దని సూచన

ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రానున్న నాలుగు రోజులపాటు..

కారును లారీ ఢీ కొట్టి.. హైదరాబాద్ దంపతులు మృతి, ఖమ్మం జిల్లా గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘటన

పల్నాడు గ్రిడ్ ప్రాజెక్టుపై.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు!

అగ్రి యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త కోర్సులు ప్రారంభం!

Big Stories

Advertisement
×