E-Paper
Advertisement

అగ్రి యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త కోర్సులు ప్రారంభం!

అగ్రి యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త కోర్సులు ప్రారంభం!
Advertisement

Agriculture Courses: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండు కొత్త డిగ్రీ కోర్సులని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం 119 వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం సోమవారం యూనివర్సిటీ ఆడిటోరియం కమిటీ హాల్ లో ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన జరిగింది.

మార్కెట్లో డిమాండ్..

ఈ సమావేశంలోహైదరాబాద్ ఐ ఐ టీ, బిట్స్ సహకారంతో నాలుగేళ్ల బీ టెక్( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్) కోర్సు ని ప్రారంభించాలని అకడమిక్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బీ ఎస్సీ(ఫుడ్ సైన్స్, డైటెటిక్స్) ని కూడా ప్రారంభించాలని కౌన్సిల్ నిర్ణయించింది. మార్కెట్లో డిమాండ్ తో పాటు, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఈ రెండు కోర్సులని రాజేంద్రనగర్ క్యాంపస్ లోనే నిర్వహించాలని, కోర్సు సిలబస్, నియమ, నిబంధనలు రూపొందించటానికి ఒక కమిటీని వేయాలని అకడమిక్ కౌన్సిల్ తీర్మానించింది.

వ్యవసాయ శాఖ సహకారం..

Advertisement

రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ సహకారంతో రైతులలో అవగాహన కల్పించి, భరోసా కల్పించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థుల తో రాష్ట్రవ్యాప్తంగా జనవరి, ఫిబ్రవరి నెలలలో రైతు భరోసా యాత్రలు నిర్వహించాలని అకడమిక్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.ఈ సమావేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ మొలుగరం, డాక్టర్ తారా సత్యావతి, డాక్టర్ మహేందర్ కుమార్, డాక్టర్ సూరా నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also read: రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?

Tags

Related News

నెలకు రూ.లక్ష వేతనంతో.. 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ మీ సేవలో..?

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. పథకానికి 50 కోట్లు కేటాయింపు?

ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో కొత్త పద్దతి: గద్వాల్ విజయలక్ష్మి!

బౌరంపేటలో అక్రమ గ్యాస్ సిలిండర్ల దందా కలకలం

కోటి ఓట్లు.. 90 సీట్లే మా లక్ష్యం.. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×