E-Paper
Advertisement

Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!

Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!
Advertisement

Airtel Rs 1029: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం చాలా రకాల ప్లాన్లనే అందుబాటులో ఉంచింది. అయితే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, ప్రతీ రోజూ హై స్పీడ్ డేటా, ఓటీటీ బెనిఫిట్స్ కోరుకునేవారి కోసం ఓ మంచి ప్లాన్ ఆఫర్ చేస్తోంది. రూ.1029 ధరతో వచ్చిన ఈ ప్లాన్.. ఎయిర్ టెల్ యూజర్లను ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.1029 ప్లాన్ వివరాలు..

ఈ ప్లాన్ ను ఎయిర్ టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ 4G డేటా యూజర్లు వినియోగించుకోవచ్చు. అలాగే రోజూ 100 SMSలు ఉచితంగా చేసుకోవచ్చు. మీరు 5G నెట్‌వర్క్ పరిధిలో ఉండి.. 5G స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే అపరిమిత 5G డేటా (Unlimited 5G Data) బెనిఫిట్స్ సైతం ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు.

హాట్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్

Advertisement

ఈ ప్లాన్ లో హాట్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ హైలెట్ గా నిలుస్తోంది. 3 నెలల పాటు ఉచితంగా హాట్ స్టార్ లోని సినిమాలు, సిరీస్ లు, లైవ్ క్రికెట్ మ్యాచ్ లను వీక్షించవచ్చు. దీంతో పాటు ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ లోని కంటెంట్ ను సైతం యూజర్లు చూడవచ్చు.

అడిషనల్ బెనిఫిట్స్

డేటా, కాలింగ్, ఓటీటీతో పాటు ఎయిర్‌టెల్ థాంక్స్ (Airtel Thanks) యాప్ ద్వారా మరికొన్ని డిజిటల్ బెనిఫిట్స్ ను సైతం ఈ ప్లాన్ లో పొందొచ్చు. ప్రతీ నెలా నచ్చిన పాటను ఫ్రీగా హలో ట్యూన్ గా సెట్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్ కూడా పొందొచ్చు. ఉచిత వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ సైతం యూజర్లకు లభించనుంది.

Advertisement

Also Read: నేపాల్ ప్రకృతి విపత్తు.. 626కు చేరిన మృతులు.. 2,478 మంది ఆచూకీపై ఆందోళన!

ఈ ప్లాన్ ఎవరికి లాభం?

ఫ్రీ హాట్ స్టార్ ఉండటం వల్ల ఈ ప్లాన్ ఓటీటీ ప్రియులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇందులో ప్రతీ రోజూ 2GB లేదా అపరిమిత 5G రావడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి సరిగ్గా సెట్ అవుతుంది. ఈ డేటా సాయంతో సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీని స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. మరోవైపు ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకోవడం తలనొప్పిగా భావించేవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

Also Read: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు స్కూళ్లు దోపిడీ చేస్తే.. ఈ వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయండి!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×