E-Paper
Advertisement

ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
Advertisement

VC Sajjanar: స్వేచ్ఛ బ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ సైబర్‌ ముఠాలు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల ఆర్థిక లావాదేవీలు, సున్నితమైన సమాచారాన్ని (డేటా) నిక్షిప్తం చేసే సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని హైదరాబాద్‌ సీపీ వీ.సీ.సజ్జనార్‌ సూచించారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్‌ కామర్స్‌ వేదికలు, మొబిలిటీ ప్లాట్‌ఫారంలు తమ సైబర్‌ రక్షణ వ్యవస్థలతో పాటు నిపుణులైన మానవ వనరులను వెంటనే బలోపేతం చేసుకోవాలని చెప్పారు.

ఏఐ దాడులతో విదేశీ హ్యాకర్లు..

Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులతో పాటు విదేశీ హ్యాకర్లు విసురుతున్న సరికొత్త సవాళ్లను తిప్పికొట్టేలా ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. చాలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియ‌ల్స్ కంపెనీ(ఎన్ఎఫ్‌బీసీ)లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, చెల్లింపుల నిర్వహణ కోసం థర్డ్‌ పార్టీ మాడ్యూళ్లు, ఏఐ సేవలపై ఆధారపడుతున్నాయన్నారు. ఇలాంటి సహాయక వ్యవస్థలను కూడా ప్రధాన అప్లికేషన్లతో సమానంగా పరిగణించి అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఏఐ సాయంతో ఆర్థిక సంస్థల నెట్‌ వర్క్‌ లలోని లోపాలను సులువుగా గుర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా అప్‌ డేట్ చేయని పాత సాఫ్ట్‌ వేర్లు, తప్పుడు కాన్ఫిగరేషన్ ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థలు, కస్టమర్ల ఫిర్యాదుల పోర్టళ్లలోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆటోమేటెడ్ ఫండ్ డిస్బర్స్‌ మెంట్‌ వ్యవస్థలు, పేమెంట్ యాప్ ల ద్వారా కంటిరెప్ప మూసి తెరిచేలోగా మ్యూల్ ఖాతాల్లోకి కోట్ల రూపాయల నిధులను మళ్లించి పోలీసులకు ఆనవాళ్లు దొరక్కుండా డిజిటల్ రికార్డులను సైతం పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నారని తెలిపారు.

థర్డ్ పార్టీ మాడ్యూళ్లు, పాత సాఫ్ట్‌వేర్లే టార్గెట్

Advertisement

ఈ సరికొత్త సైబర్‌ ముప్పును అడ్డుకునేందుకు ఆర్థిక సంస్థలు తక్షణమే పలు కీలక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం వినియోగంలో లేనివి, గతంలో టెస్టింగ్ కోసం రూపొందించి వదిలేసిన పాత యాప్ లను సిస్టంల నుంచి వెంటనే తొలగించాలన్నారు. ముఖ్యంగా నగదు విడుదల చేసే కీలక వ్యవస్థలకు పటిష్ఠమైన భద్రత కల్పించడంతో పాటు సంస్థల్లో వాడే సాఫ్ట్‌ వేర్లను ఎప్పటికప్పుడు అప్‌ డేట్ చేయాలని, ఇంటర్నెట్‌తో అనుసంధానమైన కస్టమర్ పోర్టళ్ల భద్రతను ప్రతిరోజూ నిశితంగా సమీక్షించాలన్నారు. ఒకేసారి అసాధారణ వేగంతో, భారీ మొత్తాల్లో జరిగే లావాదేవీలను వెంటనే గుర్తించేలా ప్రత్యేక పరిమితులు విధించాలని, లబ్ధిదారుల వివరాలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు. నగదు ఖాతాల్లోకి బదిలీ అయ్యే ముందు పూర్తిస్థాయి కేవైసీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడటంతో పాటు ఉన్నతాధికారుల ఆమోదాన్ని తప్పనిసరి చేయాలన్నారు.

డిజిటల్ రక్షణకు ‘రెడ్ టీమ్’

అలాగే ఆకస్మిక దాడులు జరిగితే ఎలా స్పందించాలో తెలుసుకునేందుకు ఐటీ, సైబర్‌ భద్రతా బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తరచూ ‘రెడ్‌ టీమ్‌’ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించి సిబ్బందిని సంసిద్ధంగా ఉంచాలన్నారు. డిజిటల్‌ వ్యవస్థల్లో ఎక్కడా చిన్నపాటి భద్రతా లోపం కూడా తలెత్తకుండా సంస్థలు అత్యున్నత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. పౌరుల ఆర్థిక భద్రత దృష్ట్యా ఈ ముందస్తు నివారణ చర్యలు అత్యంత కీలకమని చెప్పారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినా, సైబర్‌ మోసానికి గురైనా తక్షణమే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్ 1930కు ఫిర్యాదు చెయ్యాలని చెప్పారు. cybercrime.gov.in పోర్టల్‌ కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Also Read: హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 63 ఏళ్ల మహిళ సైకిల్ యాత్ర.. భీమవరం నుంచి ఢిల్లీకి పయనం!

హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!

బంగ్లాదేష్ గ్యాంగ్‌తో ప్రేమలో పడి.. జీవితాన్ని నాశనం చేసుకున్న టెకీ?

వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!

సన్నబియ్యం BPT, RNR, సోనా, HMT బియ్యం ధరలు ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

కరువు సవాళ్లకు చెక్ పెట్టేలా తెలంగాణ సన్నాహాలు.. ఎల్‌నినోపై మంత్రి ఉత్తమ్ సమీక్ష!

Big Stories

Advertisement
×