E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!
Advertisement

Court Contempt: కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానాను హై కోర్టు విదించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

ప్లాట్ల తొలగింపు వివాదం

నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్లాట్ల తొలగింపుపై వివాదం విషయంలో బాధితుల వినతిని 60 రోజుల్లో పరిశీలించాలని 2025 ఆగస్టులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గడువు ముగిసినా కలెక్టర్ స్పందించక పోవడంతో కలెక్టర్ పై 2025 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ దాఖలైన తర్వాతే బాధితులకు నోటీసులు జారీ చేసారు.

ఉత్తర్వులు జారీ..

Advertisement

2026 ఫిబ్రవరి 26న వినతి తిరస్కరణకు గురికాగా జులై 8న మరోసారి ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి అయినా కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడం కుదరదని స్పష్టం చేసింది. జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు 4 వారాల గడువుతో పాటు శిక్ష అమలును 4 వారాల పాటు హైకోర్టు నిలిపివేసింది.

Also Read: సన్నబియ్యం BPT, RNR, సోనా, HMT బియ్యం ధరలు ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

Tags

Related News

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 63 ఏళ్ల మహిళ సైకిల్ యాత్ర.. భీమవరం నుంచి ఢిల్లీకి పయనం!

ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!

బంగ్లాదేష్ గ్యాంగ్‌తో ప్రేమలో పడి.. జీవితాన్ని నాశనం చేసుకున్న టెకీ?

వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!

సన్నబియ్యం BPT, RNR, సోనా, HMT బియ్యం ధరలు ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

కరువు సవాళ్లకు చెక్ పెట్టేలా తెలంగాణ సన్నాహాలు.. ఎల్‌నినోపై మంత్రి ఉత్తమ్ సమీక్ష!

Big Stories

Advertisement
×