E-Paper
Advertisement

సర్జరీ గురించి మొదటిసారి మాట్లాడిన అషు రెడ్డి!

సర్జరీ గురించి మొదటిసారి మాట్లాడిన అషు రెడ్డి!
Advertisement

Ashu Reddy:సోషల్ మీడియాలో ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా కనిపించే సెలబ్రిటీల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. బయట ప్రపంచానికి కనిపించని ఎన్నో ఆరోగ్య సమస్యలను వారు ఎదుర్కొంటుంటారు. తాజాగా సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి తన జీవితంలో ఎదుర్కొన్న పెద్ద ఆరోగ్య సమస్య గురించి తొలిసారి ఓపెన్‌గా మాట్లాడింది. సుప్రిత హోస్ట్ గా చేస్తున్న ఒక పాడ్‌కాస్ట్ షోలో ఆమె తన ప్రాణాపాయ పరిస్థితి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. ఆ వివరాలు చూద్దాం..

సుప్రీత కొత్త టాక్ షో అదుర్స్:

సురేఖావాణి పర్సనల్ వీడియోల వైరల్ వివాదం ఒకవైపు నడుస్తుండగా.. ఆమె కూతురు సుప్రీత తన కొత్త టాక్ షో ను ప్రారంభించింది. ఎంట్రీలోనే బోల్డ్ టచ్ ఇస్తూ అషు రెడ్డిని గెస్ట్‌గా పిలిచింది. ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి చేసిన ఈ చిట్‌చాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. షోలో భాగంగా విజయ్ దేవరకొండతో రెండో పెళ్లి, సుధీర్ బావతో రిలేషన్ అంటూ వస్తున్న రూమర్లపై అషు రెడ్డి తనదైన శైలిలో నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు.

టొమాటో సైజ్ ట్యూమర్, బ్రెయిన్ సర్జరీ:

Advertisement

షోలో భాగంగా తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ అషు రెడ్డి ఎమోషనల్ అయ్యారు. గత ఐదేళ్లుగా తాను ఎదుర్కొన్న ఇన్సల్ట్స్ గురించి చెబుతూనే.. తన జీవితంలో జరిగిన బిగ్గెస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్‌ను బయటపెట్టారు. ఒకానొక సమయంలో చెకప్‌కు వెళ్తే.. బ్రెయిన్‌లో టొమాటో సైజ్‌లో ట్యూమర్ ఉందని డాక్టర్లు చెప్పారని, ఓవర్‌నైట్ సర్జరీ చేయాలని తేల్చేశారని తెలిపారు. ఇక కుట్లు తీశాక తనను తాను అద్దంలో చూసుకున్నప్పుడు ఎంతగానో భయపడ్డానని, అన్ బేరబుల్ పెయిన్ అనుభవించానని కంటతడి పెట్టుకున్నారు.

ALSO READ:ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

నెటిజన్ల ట్రోల్స్‌పై అషు రెడ్డి ఫైర్:

Advertisement

చావు వరకు వెళ్లి బ్రెయిన్ సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న ఆ కష్టకాలంలోనూ కొందరు యూట్యూబ్ తంబ్ నెయిల్స్, నెగిటివ్ కామెంట్స్‌తో తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారని అషు ఆవేదన వ్యక్తం చేశారు. “నా జర్నీ ఏంటో తెలియకుండా, నేను ఎంత పెయిన్ అనుభవించానో చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఒక పొజిషన్‌లో ఉన్న మహిళ కూడా నా గురించి తప్పుగా మాట్లాడటం చూసి అసహ్యం వేసింది. ఇలాంటి వాళ్ళని ఏమని అనాలో తెలియటం లేదు” అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఒకవైపు నవ్వులు, మరోవైపు సోషల్ మీడియా రూమర్స్.. అన్నింటినీ మించి తన ప్రాణాపాయ సర్జరీ గురించి అషు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇక పర్సనల్ లైఫ్‌లో ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ ముందుకు సాగుతున్న అషు రెడ్డి గట్స్‌ను అందరూ అభినందిస్తున్నారు.

Related News

ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

అబ్బబ్బా.. ఏం పాటరా బాబు! ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్ రచ్చ!

వచ్చే ఏడాది పెళ్లి.. బిగ్ బాంబ్ పేల్చిన సుప్రీత!

అలీ వైఫ్ జుబేదా యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

అలా ఈడ్చుకెళ్తుంటే కనిపించలేదా మీకు.. నరేష్ పై నీతూ మాస్టర్ ఫైర్!

Big Stories

Advertisement
×