Hyderabad News: మెట్రో నగరాల్లో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో కొత్త కొత్త టెక్నాలజీతో పార్కింగ్ వ్యవస్థను తీసుకొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రెండువారాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. ఇంతకీ ఎక్కడో తెలుసా? అనేదానిపై ఇంకాస్త లోతుగా వెళ్తే..
దేశంలోని పెద్ద నగరాల్లో వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయం లో పార్కింగ్ సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలో మెట్రో నగరాలకు చెందిన అధికారులు పార్కింగ్ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అధ్యయనం చేస్తున్నారు. లేటెస్ట్‌గా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం ట్రయిల్ రన్ జరుగుతోంది. రెండువారాల్లో నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేబీఆర్ పార్క్ సమీపంలో 400 గజాల ప్రాంతంలో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒకేసారి 72 కార్లను నిలుపుకోవచ్చు. మరో పది లేదా రెండువారాల పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.
కొరియా టెక్నాలజీ ద్వారా మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించారు. ఇందుకోసం ఆరు కోట్ల రూపాయలను వెచ్చించారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య తగ్గే అవకాశముంది. ఈ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ జామ్ సమస్య కొంతమేరా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ALSO READ: హరీష్‌రావుకు అస్వస్థత.. ఆయన ప్రస్తుత పరిస్థితి
కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళ పార్క్‌కు వచ్చేవాకర్లు.. అందులో కార్లను పార్కింగ్ చేయవచ్చు. దాని ద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశముంది. మల్టీ లెవెల్ పార్కింగ్ సక్సెస్ అయితే నగరంలో రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎంట్రీ గేట్-1 వద్ద ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. గ్రౌండ్ లెవెల్‌లో పార్కింగ్ చేయవచ్చు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు అందుబాటులో ఉండనుంది. దీనికితోడు త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.
పార్కింగ్ స్లాట్ బుకింగ్, చెల్లింపుల కోసం మొబైల్ యాప్ అందుబాటులోకి రానున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీనికితోడు మినీ-మార్ట్, కాఫీ కియోస్క్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
A new multi-level parking complex at #KBRPark, #BanjaraHills, featuring #Korean technology and a 72-car capacity, has started a 10-day trial run. pic.twitter.com/VR5HMRgFEQ
— NewsMeter (@NewsMeter_In) June 15, 2025