Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. కాసేటి క్రితమే ఆయన హై ఫీవర్‌తో బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే హరీష్ రావు అస్వస్థతకు గురి కాగా.. సమావేశం మధ్యలోనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Weather News: రాష్ట్రంలో రేపు భారీ వర్షం.. ఈ 13 జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
హరీష్ రావుకు ఫీవర్ తో పాటు ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పార్టీ శ్రేణులు ఆందోళన చెందొద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆయన అనుచరులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ALSO READ: CM Revanth Reddy: దేశంలోనే తెలంగాణ నంబర్ వన్.. ఇదికదా ప్రజా ప్రభుత్వం అంటే: సీఎం రేవంత్