Hyderabad: అయ్యప్ప మాల ధరించాడని స్కూల్ యాజమాన్యం 6వ తరగతి విద్యార్థిని క్లాస్ రూంలోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాల వేసుకుంటే ఎందుకు అనుమతించరంటూ స్కూల్ ముందు విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. స్కూల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
అయ్యప్ప మాల ధరించి స్కూల్ ఎందుకు రాకూడదని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నిస్తు్న్నారు. విద్యా్ర్థి సంఘాల నేతలు స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి కుటుబ సభ్యులు, బంధువులు స్కూలు ముందు బైఠాయించారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లారు.
అయ్యప్ప మాల ధరించాడని విద్యార్థిని క్లాస్ రూం లోపలకి అనుమతించని పాఠశాల యాజమాన్యం
సికింద్రాబాద్ జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన
మాల వేసుకుంటే ఎందుకు అనుమతించరంటూ స్కూల్ ముందు విద్యార్ధి కుటుంబ సభ్యుల ఆందోళన pic.twitter.com/WGeYsM3YQZ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2025
ఏపీలోని విజయవాడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భవానీపురం ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో వివాదం నెలకొంది. 3, 5వ తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అయ్యప్ప స్వామి మాల ధరించి స్కూలుకు వచ్చారు. స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించలేదు. మాల వేసుకుని పాఠశాలకు రాకూడదని యాజమాన్యం వారిని అడ్డుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ వారితో దురుసుగా ప్రవర్తించడంతో.. స్థానిక అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. స్వామి మాల వేసుకుంటే స్కూల్ లోపలికి అనుమతించమని ప్రిన్సిపాల్ చెప్పడంతో.. స్వాములకు, ప్రిన్సిపాల్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Also Read: Warangal Floods: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. వరంగల్ అతలాకుతలం
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పారు. స్కూల్ యాజమాన్యం తమ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు మూడు రోజుల సమయం ఇచ్చింది. ఈ ఘటనపై డీఈఓకి లేఖ రాశామని, అక్కడి నుంచి రిప్లై వస్తే విద్యార్థులు మాలలో స్కూల్ కు రావడానికి అనుమతించాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయం తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం పోలీసులకు తెలిపింది. పోలీసుల హామీ మేరకు అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించారు.