E-Paper
Advertisement

Hydra: మేడికుంట ఆక్ర‌మ‌ణ‌లను తొలగించిన హైడ్రా

Hydra: మేడికుంట ఆక్ర‌మ‌ణ‌లను తొలగించిన హైడ్రా
Advertisement

Hydra:  మేడ్చ‌ల్ – మ‌ల్కాజ్ గిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం, బాచుప‌ల్లి గ్రామంలోని మేడికుంట ఆక్ర‌మ‌ణ‌ల‌కు హైడ్రా సోమవారం యాక్షన్ చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని ఆక్ర‌మించి ప్ర‌ధాన ర‌హ‌దారివైపు వేసిన దుకాణాల‌ను శ‌నివారం హైడ్రా తొల‌గించింది. మొత్తం 21 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై 18 ఎక‌రాల‌కు ప‌రిమిత‌ం కాగా, ఉన్న చెరువును కూడా ప‌క్క‌నే దుకాణాలు పెట్టి క‌లుషితం చేస్తున్నార‌ని హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదు అందింది. మాంసం, చికెన్, చేప‌ల దుకాణాల‌తో వ్య‌ర్థాల‌ను చెరువులోకి వ‌దిలి క‌లుషితం చేస్తున్నార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు.

Also Read: NTPC Recruitment: రూ.2,40,000 జీతంతో ఉద్యోగాలు.. ఇలాంటి జాబ్ కొడితే డబ్బులే డబ్బులు, పూర్తి వివరాలివే

10 మీట‌ర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ 

Advertisement

మున్సిప‌ల్‌, రెవెన్యూ అధికారుల‌తో హైడ్రా క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించింది. ఎఫ్‌టీఎల్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకుంది. ఈ మేర‌కు అక్క‌డున్న పది దుకాణాలను ఖాళీ చేయించింది. పెద్ద మొత్తంలో చెరువు ఒడ్డున ప‌డేసిన మాంసం వ్య‌ర్థాల‌ను కూడా హైడ్రా తొల‌గించింది. చెత్త‌ను వేయ‌డానికి వీలు లేకుండా, 10 మీట‌ర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అక్క‌డ చెత్త‌ను టిప్ప‌ర్ల‌తో హైడ్రా తొల‌గించ‌గా, అదే ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు మున్సిప‌ల్ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. చెరువు ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గి ప్ర‌జావినియోగంలోకి రావ‌డం ప‌ట్ల స్థానిక‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Also Read:Errolla Srinivas: జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలి.. రాహుల్ గాంధీపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×