Bigg Boss 9 Telugu Promo : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఒక వారం పూర్తయింది రెండవ వారం ఎలిమినేషన్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటి ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయింది.. ఇక రెండో వారం ఎవరు బ్యాగు సదుకుని బయటకు వెళ్తారా అని ఆసక్తి బిగ్ బాస్ ఆడియన్స్ లో నెలకొంది. వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎంతగా వెయిట్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున డాన్స్ తో పాటు కంటెస్టెంట్లకు ఇచ్చే క్లాసుల కోసం బిగ్ బాస్ ఫాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీకెండు నాగార్జున ఎవరికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తాడో తెలుసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎలిమినేషన్ కన్నా డిమాన్ పవన్, రీతూ కు ఇచ్చిన క్లాస్ హైలెట్ అయ్యింది.. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.. అదేంటంటే..
శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురుచూస్తుంటారు. నాగార్జున వచ్చి ఒక్కొక్కరికి క్లాస్ పీకుతాడు.. రెండో వారం కంటెస్టెంట్స్ పై నాగ్ సీరియస్ అయ్యాడు. ముఖ్యంగా సంచాలక్ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లనే కామనర్స్ లో ఒకరైన పవన్ కెప్టెన్ అయిపోయాడు. అయితే గత వారం సెలబ్రిటీల నుండి ఒకరు కెప్టెన్ అయ్యారు.. ఈ వారం కామనర్స్ నుంచి ఒకరు కెప్టెన్ అవుతారని ఊహించలేదు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో ఎవరు ఊహించని విధంగా పవన్ కెప్టెన్సీ ని రద్దు చేశారు నాగార్జున. ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరు అని అందరికీ కొత్త ఆలోచన మొదలైంది. కేవలం కెప్టెన్సీ రద్దు చేయడమే కాకుండా సంచాలక్ వ్యవహరించిన రీతూకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నాగార్జున.. ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ హౌస్ కు పవన్ కెప్టెన్ అయ్యినట్లు తెలుస్తుంది.
Also Read: గుడ్ న్యూస్ చెప్పిన అవని.. ఫిట్టింగ్ పెట్టిన పల్లవి.. నిజం తెలుసుకున్న అవని..?
శనివారం ఎపిసోడ్ లో నాగ్ పవన్, రీతూకు కలిపి క్లాస్ పీకాడు. సడెన్గా గా పవన్ ను కెప్టెన్సీ నుంచి తీసేశాడు.. అయితే ఇవాళ కొత్త కెప్టెన్ కోసం ఇచ్చిన టాస్క్ లో డిమాన్ పవన్ మళ్లీ విన్ అవుతాడు.. అంటే నిన్న రద్దు చేశారు. ఇవాళ మళ్లీ కెప్టెన్ గా ఎంపిక చేశారు. దీనిపై బిగ్ బాస్ ఆడియన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్ను ఎందుకు కెప్టెన్సీ నుంచి తీసేసారు ఇవాళ ఎందుకు మళ్ళీ కెప్టెన్ గా కూర్చోబెట్టారు అని ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి ఇవాళ ఎపిసోడ్ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతి సీజన్లో ఎవరో ఒకరిని బిగ్ బాస్ దత్తపుత్రుడుగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని క్షమించి ఫైనల్ వరకే తీసుకుని వెళ్తారు. అలాగే ఈ సీజన్లో డిమాన్ పవన్ ని దత్తపుత్రుడుగా తీసుకున్నారు ఏమో అనే అనుమానాలు కూడా ఆడియన్స్ లో వ్యక్తమవుతున్నాయి. మళ్లీ కెప్టెన్ అవ్వడం పై ఇవాళ ఎపిసోడ్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు దీనిపై నాగార్జున వివరణ ఇవ్వనున్నారని సమాచారం. మొదటివారం శ్రేష్టవర్మ, రెండవ వారం మర్యాద మనీష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.. మరి మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే…