BigTV English

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్.. ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్..  ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Ponds beautification: రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా, తన పని తాను చేసుకుపోతోంది. రాబోయే ఆరునెలల్లో చేయబోయే టార్గెట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయనుంది. ప్రస్తుతం ఆయా పనుల్లో బిజీ ఉంది.


హైదరాబాద్ డిజాస్టర్ రెన్సాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రా దృష్టి పెట్టింది. ఓ వైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది. తనను తానే టార్గెట్ ఫిక్స్ చేసింది.

హైదరాబాద్ సిటీలో చెరువుల పూర్వభవానికి పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణను ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేసింది. వాటిలో బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్- అప్పచెరువును ఎంపిక చేసింది.


ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌లో ఒక్కో చెరువును ఎంపిక చేసుకుంది. తొలుత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్ పూర్తి చేయనుంది. దీని కోసం నెలరోజులు కేటాయించనుంది. తర్వాత చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌, ఆ తర్వాత సుందరీకరణ ఇలా దశల వారీగా వాటి పనులు చేయనుంది.

ALSO READ:  తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

దాదాపు 200 కోట్లతో చెరువుల బ్యూటిఫికేషన్‌కు చర్యలు చేపట్టనుంది. నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు సీఎస్ఆర్ కింద వాటిని అప్పగించాలని ఆలోచన చేస్తోంది. ఆక్రమణల నుంచి కాపాడిన చెరువుల వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలతోపాటు సెక్యూరిటీ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాదిలోపు మిగిలిన చెరువులను సుందరికరణ చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×