E-Paper
Advertisement

Hyderabad News: గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు.. ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు, ఆనందంలో బాధితులు

Hyderabad News: గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు.. ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు, ఆనందంలో బాధితులు
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మరోసారి ఆక్రమణలను తొలగించింది హైడ్రా. గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కోపరేటింగ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో అక్రమ కట్టడాలు, అనుమతులు లేని షెడ్‌లను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే సంధ్య శ్రీధర్‌రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. FCI బాధితులకు అండగా ఉండాలని హైడ్రాకు సూచన చేసింది.

గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు కూల్చివేసిన హైడ్రా

Advertisement

ఈ నేపథ్యంలో సోమారం ఉదయం రంగంలోకి దిగింది హైడ్రా. ఉదయం ఆరుగంటల నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది. 6 జేసీబీలు, ఓ బాహుబలి మిషన్‌తో కలిసి కూల్చివేతలు మొదలుపెట్టింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. 4 భారీ షెడ్లు, ఒక స్లాబ్ కన్‌స్ట్రక్షన్‌ను అక్రమంగా గుర్తించారు.

హైకోర్టు ఆర్డర్స్‌తో సంధ్య కన్వెన్షన్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తున్నారు అధికారులు. పార్కులు, రోడ్లలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు. దీంతో రోడ్లను, పార్కు స్థలాలను రీ స్టోర్ చేస్తున్నారు అధికారులు. 1980 లో 20 ఎకరాల్లో FCI ఎంప్లాయిస్ కోపరేటింగ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేశారు.

Advertisement

న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి హైడ్రా

2015 లో శ్రీధర్‌రావు వాటిని ఆక్రమించారు. మొత్తం 20 ఎక‌రాల ప‌రిధిలో వేసిన లేఔట్‌లో 162 వ‌ర‌కు ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది.  దీనిపై బాధితులు హైకోర్టు తలుపు తట్టారు.  ఎక్కువ ప్లాట్లు తీసుకుని త‌మ‌ను భ‌య‌పెట్టి మిగ‌తావి సొంతం చేసుకోవాల‌ని సంధ్యా శ్రీ‌ధ‌ర‌రావు ప్ర‌య‌త్నించార‌ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ప‌క్క‌నే మా ప్లాట్లు, పార్కుల స‌రిహ‌ద్దులు ఏమాత్రం ప‌ట్టించుకోకుండా నిర్మాణాలు చేప‌ట్టార‌ని వివరించారు.

ఓ ప్లాట్ ఓనర్‌పై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టార‌ని పేర్కొన్నారు. అందుకు శ్రీ‌ధ‌ర్‌రావుకు సుప్రీంకోర్టు జరిమానా విధించిన విష‌యాన్ని కోర్టులో ప్రస్తావించారు. ఆయన చర్యల వల్ల తమ ప్లాట్లు చూడడానికి వీల్లేకుండా చేశారని పేర్కొన్నారు. ఒకానొక దశలో దాడులు చేసి తమను భయబ్రాంతులకు గురి చేశారని, చివరకు హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు.

ALSO READ:  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా చిక్కిన బంగారం

హైకోర్టు తీర్పు మేరకు అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో నేలమట్టం చేస్తున్నారు అధికారులు. ఐదు పెద్ద బిల్డింగ్స్, 17 ఐరన్ స్ట్రాస్టర్స్ తొలగిస్తున్నారు.  గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెల్సిందే.

 

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×