E-Paper
Advertisement

HYDRAA Bikes: హైడ్రా బైక్ టీమ్స్ హల్చల్.. భారీ విపత్తుల కోసం సీఎం రేవంత్ తెచ్చిన సరికొత్త ఆర్మీ!

HYDRAA Bikes: హైడ్రా బైక్ టీమ్స్ హల్చల్.. భారీ విపత్తుల కోసం సీఎం రేవంత్ తెచ్చిన సరికొత్త ఆర్మీ!
Advertisement

HYDRAA Bikes: స్వేచ్ఛ బ్యూరో: వ‌ర్షాకాలం ఆరంభం కావటంతో అన్ని ప్రభుత్వ శాఖలు సహాయక చర్యలకు సిద్దమవుతున్నాయి. కానీ టెక్నికల్ గా సహాయక చర్యలు చేపట్టే హైడ్రా మరో అడుగు ముందుకేసి భారీ వాహానాలు వెళ్లలేని చోటకు సకాలంలో చేరుకుని, సహాయక చర్యలను చేపట్టేందుకు వీలుగా బైక్ టీమ్ లను సిద్దం చేసింది. ఈ నెల 9వ తేదీన కేవలం గంట స‌మ‌యంలో 10 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైన సంగతి తెల్సిందే. వ‌ర‌ద నీరు ర‌హ‌దారుల‌ను ముంచెత్తుతుంటే.. మ‌రోవైపు దారిక‌డ్డంగా ప‌డిపోతున్న చెట్లు రాక‌పోక‌ల‌కు అంత‌రాయంగా మారుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి.

హైడ్రా బైకు టీమ్‌లు..

హైడ్రా డీఆర్ ఎఫ్ వాహ‌నాలు వెళ్లేందుకు అవ‌కాశం లేని ప‌రిస్థితుల్లో హైడ్రా బైకు టీమ్‌లు త‌క్ష‌ణ‌మే అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మవుతుంది. గ‌తేడాది హైడ్రా పోలీసు స్టేష‌న్ ప్రారంభోత్స‌వంలో భాగంగా బైకు టీమ్‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఈ సారి బైక్‌టీమ్‌ల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకునే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. మొత్తం 20 బైకుల‌ను డీఆర్ ఎఫ్ వాహ‌నాల వద్దే అందుబాటులోకి ఉంచుతున్నారు. డీఆర్ ఎఫ్ వాహ‌నం వెళ్లే వీలు లేని ప‌రిస్థితుల్లో బైకు టీమ్‌లు స్పాట్‌కు చేర‌కుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది.

ఎమ‌ర్జ‌న్సీ రెస్పాన్స్ టీమ్‌గా..

Advertisement

హైడ్రా బైక్ టీమ్‌లు రౌండ్ ది క్లాక్ అలర్ట్ గా ఉంటూ అవసరమైన చోటకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నాయి. మొత్తం 60 మంది మూడు షిప్టుల్లో అందు బాటులో ఉంటున్నారు. ముఖ్య‌మైన ప్రాంతాల‌తో పాటు ప్ర‌ధాన‌మైన ర‌హ‌దారుల వెంట ఉన్న డీఆర్ ఎప్ వాహ‌నాల్లోనే వీటిని ఉంచి ఎమ‌ర్జ‌న్సీ రెస్పాన్స్ టీమ్‌గా వినియోగిస్తున్నారు. బైకుల‌కు బాక్సులు కూడా అమ‌ర్చి అందులో రెండు బ్యాట‌రీతో న‌డిచే రంపాలు, బ‌ల‌మైన రోప్ (తాడు) ఉంటుంది. చెట్టు కొమ్మ‌ల‌ను వెంట‌నే క‌ట్ చేసి తాడు సాయంతో ఆ చెట్టును ప‌క్క‌కు లాగ‌డానికి వెసులుబాటుగా ఉండే ప‌రిక‌రాలు ఆ బాక్సులో ఉంచుతారు. న‌గ‌రంలో డీఆర్ ఎఫ్‌, మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు, స్టాటిక్ టీమ్‌ల‌కు అద‌నంగా బైకు టీమ్‌లు ప‌ని చేస్తున్నాయి. ర‌హ‌దారిపై తీవ్ర‌మైన ట్రాఫిక్ జామ్ ఉన్నా బైకును ఫుట్‌పాత్ ఎక్కించి ఎమ‌ర్జ‌న్సీ సేవ‌ల్లో బాగంగా ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుంటారు. అలాంటి అవ‌కాశం కూడా లేని ప‌క్షంలో ప‌నిముట్లు చేతిలో ప‌ట్టుకుని ఘ‌ట‌నాస్థలానికి చేరుకుంటారు. ముందుగా ర‌హ‌దారిపై ఉన్న ఆటంకాలు తొల‌గించి ట్రాఫిక్ క్లియ‌ర్ చేయ‌డంలో హైడ్రాలో బైక్ టీమ్‌లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి.

Also read; Tank Neglect: జహీరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం.. ఎండిపోతున్న రైతుల పొలాలు!

వాట‌ర్ లాగింగ్ పాయింట్ల‌లో..

Advertisement

చెట్లు ప‌డిపోయిన‌ప్పుడే కాకుండా ర‌హ‌దారుల‌పై భారీగా నీరు నిలిచిన‌ప్పుడు కూడా గ‌డ్డ‌పార‌తో పాటు ఇత‌ర ప‌నిముట్లు తీసుకుని ఈ బైక్ టీమ్‌లు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుంటాయి. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి రాక‌పోక‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాయి. ఈ విధంగా మ‌ల్టీ టాస్క్ ప‌నులు చేసేందుకు వీలుగా వీరికి హైడ్రా శిక్ష‌ణ ఇచ్చింది. డీఆర్ ఎఫ్ సిబ్బందిలో ఒక‌రు వీరికి తోడుగా ఉండి ప‌నులు చేప‌డ‌తారు. మెట్ టీమ్‌లు, స్టాటిక్ టీమ్‌లు, డీఆర్ ఎఫ్ టీమ్‌లు క‌లి‌సి వ‌ర‌ద ప‌రిస్థితులే కాకుండా ర‌హ‌దారుల్లో ఆటంకాల‌ను కూడా తొల‌గించ‌డంలో నిమ‌గ్నమవుతున్నాయి.

కూలిపోయిన చెట్లు..

శుక్ర‌వారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 1లో వ‌రుస‌గా ఇరువైపులా 3 చెట్లు కూలిపోయాయి. నిమ్స్‌లోని మిలీనియం బ్లాక్‌పైన చెట్లు ప‌డిపోయాయి. డీఆర్ ఎఫ్ ట్రక్కులు వ‌చ్చేస‌రికి ఆల‌స్యం అయ్యే ప‌రిస్థితులుండ‌డంతో బైక్ టీమ్‌లు చెట్లు న‌రికే రంపాలు ప‌ట్టుకు వ‌చ్చి భ‌వ‌నంలోని కిటికీల ద్వారా వాటిని తొల‌గించారు. అలాగే అదే మార్గంలో కొమ్మ‌ల‌ను వెంట‌నే తొల‌గించి ఒక‌వైపు ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా చేసి రాక‌పోక‌ల‌ను సుల‌భం చేశారు. ఇలా బైక్ టీమ్‌లు ఇప్పుడు హైడ్రాలో ఎమ‌ర్జ‌న్సీ రెస్పాన్స్ టీమ్స్‌గా సేవందించ‌డంలో ముందుంటున్నాయి.

Also read: Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Related News

హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! – సీఎం రేవంత్

తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్.. నెలకు రూ.1000, ఇంకెందుకు ఆలస్యం

నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!

Big Stories

Advertisement
×