E-Paper
Advertisement

ఉత్కంఠగా మారిన పట్నం పాలిటిక్స్.. రాష్ట్రంలో అందరి చూపు అటువైపే..?

ఉత్కంఠగా మారిన పట్నం పాలిటిక్స్.. రాష్ట్రంలో అందరి చూపు అటువైపే..?
Advertisement

Chairman Election: ఏ పార్టీ ఖాతాలోకి చైర్మన్​ పీఠం..?
–పట్నం పాలకవర్గం ఎన్నికపై సన్నహాలు
–కోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్​ అడుగులు
–ఈ నెల 4న చైర్మన్​, వైఎస్​ చైర్మన్​ ఎన్నికకు గ్రీన్​ సిగ్నల్​

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి రెండు నెలలు గడుస్తున్నప్పటికి చైర్మన్​ ఎన్నిక విషయంలో జాప్యం జరుగుతుంది. రాష్ట్రంలోని జరిగిన అన్ని మున్సిపాలిటిలో పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేసి చైర్మన్​, వైస్​ చైర్మన్​ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. కానీ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం, క్యాతన్​పల్లి మున్సిపాలిటీలకు చైర్మన్​, వైస్​ చైర్మన్​ ఎన్నిక ఈనెల 4న నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్​ ఎన్నిక హడావుడి ప్రారంభమైయింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో రెండు సార్లు చైర్మన్​ ఎన్నిక వాయిదా పడింది. అంతేకాకుండా ఇరు పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లు నువ్వా నేనా అంటూ కోర్టు మెట్లు ఎక్కాయి. చైర్మన్​ ఎన్నికకు అవసరమైన మేజార్టీ బీఆర్ఎస్​ పార్టీకి ఉన్నప్పటికి దక్కించుకోలేని స్థితిలో ఉంది. అధికార పార్టీ ఎలాగైనా చైర్మన్​ పీఠం కైవసం చేసుకోవాలని చూస్తోంది. శనివారం జరిగే ఎన్నికతో చైర్మన్​ పీఠం ఎవరు దక్కించుకుంటారో స్పష్టత వస్తుందనే ప్రచారం సాగుతుంది.

బీఆర్​ఎస్​ అభ్యర్ధి కాంగ్రెస్​ వైపు..

Advertisement

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధలో 24 మంది కౌన్సిలర్లు ఉన్నాయి. ఇందులో చైర్మన్​ ఎన్నికకు 13 సభ్యుల మద్దతుంటే మ్యాజిక్​ ఫీగర్ ఉన్నట్లు. ఫిబ్రవరి నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 13మంది, కాంగ్రెస్​ 08, బీజేపీ 02, స్వతంత్ర అభ్యర్ధి చొప్పున వార్డు కౌన్సిలర్లుగా గెలుపోందారు. నిబంధనల ప్రకారం చైర్మన్​ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మేజార్టీ బీఆర్​ఎస్​కు దక్కిందని చెప్పాల్సిందే. కానీ కాంగ్రెస్​ పార్టీ చైర్మన్​ పీఠం దక్కించుకునేందుకు బీఆర్​ఎస్ సభ్యులను ఆకర్షించింది. బీఆర్ఎస్​ సీనియర్​ నాయకుడు ఆకుల యాదగిరి చైర్మన్​ స్ధానం ఆశించి భంగపడినట్లు సమాచారం. దాంతో ఈ అవకాశాన్ని కాంగ్రెస్​ తమవైపు మల్చుకునేందుకు ఆ సభ్యునికి చైర్మన్​ పీఠం ఇచ్చేందుకు సిద్దమైయింది. దీంతో పట్నం చైర్మన్​ పీఠం రాజకీయ రణరంగంగా మారిపోయింది.

Also Read: మీ సేవా కేంద్రాల్లో పెరిగిన ఛార్జీలు.. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు

ఈ నెల 4వ తేదీన..

Advertisement

అప్పుడు బీఆర్ఎస్​ 13 మంది గెలిచిన సభ్యుల్లో ఒకరు కాంగ్రెస్​ వైపు వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్​ సభ్యుల సంఖ్య 12కాగా స్వతంత్ర అభ్యర్ధి, ఒక బీజేపీ అభ్యర్ధిలు సైతం మద్దతు ఇవ్వడంతో 14కు చేరింది. కాంగ్రెస్​ పార్టీకి బీజేపీ, బీఆర్ఎస్ సభ్​యుల మద్దతుతో 10కి చేరుకుంది. ఎక్స్​ ఆఫీసియో అభ్యర్ధి ఎమ్మెల్యే ఓటుతో కలిపి 11కు చెరింది. అయినప్పటికి బీఆర్​ఎస్​ మద్దతుదారుల సంఖ్యను దాటలేకపోయిందనే చెప్పాలి. కానీ ఈ నెల 4వ తేదీన ఇంకా ఎదైనా రాజకీయ ఎత్తుగడలు జరిగితే చైర్మన్​ పదవీ కీలకంగా మారనుంది.

ఎన్నికల కమీషన్​ ముందుకు..

ఫిబ్రవరి నెల 16వ తేదీన జరిగే ఎన్నిక ప్రక్రియలో అభ్యర్ధి మిస్సింగ్​ అయ్యాడానే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు. మరసటి రోజు జరిగిన ఎన్నిక ప్రక్రియలో పూర్తిస్థాయిలో కొరం ఉన్నప్పటికి బీఆర్​ఎస్​ పార్టీపై ఆకుల యాదగిరి కిడ్నాప్​ చేశారనే అభియోగంపై కాంగ్రెస్ పార్టీ సహాయంతో కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పాలకవర్గ సభ్యుల ప్రమాణం స్వీకారం ముగిసి చైర్మన్​ ఎన్నిక జరిగిన తర్వాత ఎన్నికను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఒకరిపై ఒకరు పిర్యాదులతో, ఆందోళనలతో వాయిదా పడింది.

నిబంధనలకు విరుద్దంగా..

బీఆర్ఎస్​ అభ్యర్ధులపై కూడా నిబంధనలకు విరుద్దంగా పోటీ చేశారనే నేపంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​కు సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీ కోర్టను ఆశ్రయించడంతో జరిగిన పరిణామాలతో ఎన్నికల కమీషన్కు చైర్మన్​ ఎన్నిక బాధ్యతను అప్పగించింది. ఎట్టకేలకు ఎన్నికల కమీషన్​ ఈనెల 4న చైర్మన్​ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది.

Also Read: గ్యాస్ దొరకదు.. ధర తగ్గదు.. కేంద్రంపై సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×