Ibrahimpatnam Municipality: రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ఎన్నిక ఏదైన పట్టు సాధించుకోవాలనే తపనతోనే పార్టీలు వ్యూహాలకు ప్రతి వ్యూహాం చేస్తాయి. పంచాయతీ ఎన్నికల మొదలు నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారం కాపాడుకోవడానికి ఆయా పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. అధికారంలోనున్న పార్టీయే క్షేత్రస్థాయిలో బలనిరూపణ చేసుకోవాలని తపన పడుతుంది. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీయే కాదు.. గతంలో పనిచేసిన ప్రతి ప్రభుత్వాలు ఇదే రాజకీయం చేయడం రాష్ట్రంలో ఆలవాటుగా మారిపోయింది. కాకపోతే కొన్ని ప్రభుత్వాల్లో నామినేషన్ల వేయకుండా, వేసిన నామినేషన్లు విత్ డ్రా చేయడానికి కూడా అధికార పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తాయి.
ప్రస్తుతం అధికారంలోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆపని మాత్రము చేయలేదు. కానీ సభ్యుల ఆమోదంతో ఎన్నిక చేసే చైర్మన్ పదవులను మాత్రం తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్ పార్టీ సైతం గులాబీ జెండా ఎగరవేస్తామని అధికార పార్టీకి సవాళ్లు విసురుతుంది. రాజ్యంగ బద్దంగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధుల బలబలాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. రాజకీయ ఎత్తుగడలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్ అఫీసియో ఓట్లతో చైర్మన్ కైవసం చేసుకోవాలని వ్యూహాలు చేస్తుంది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులున్నాయి. ఇందులో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్ధి ఒకరు చొప్పున మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపోందారు. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 24 వార్డుల్లో 13 స్ధానాలు గెలుపోందిన పార్టీకే అవకాశాలుంటాయి. అయితే ఎక్స్ అఫీసీయో ఓటు ఎమ్మెల్యేకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంపీకి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఎంపీ ఆయన పరిధిలో ఎక్కడ అవకాశం ఉంటే ఆ మున్సిపాలిటీలో ఓటు నమోదు చేసుకునేలా ఎన్నికల సంఘం నిబంధనలు విడుదల చేశారు. ఎంపీ మరో చోట జరిగే చైర్మన్ ఎన్నికల్లో పాల్గోంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్ ఆపీసియోగా ఇబ్రహీంపట్నంలో నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈవిధంగా మున్సిపాలిటీలో మొత్తం 25 ఓట్లు ఉండగా చైర్మన్ దక్కించుకునేందుకు 13 ఓట్లు సరిపోతాయి. అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్కు బలమున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ 13 స్ధానాలు గెలిచినప్పటికి ఒక స్వతంత్ర, ఒక బీజేపీ అభ్యర్ధిలు కూడా మద్దతు పలుకుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఓటింగ్ బలం 15కి పెరిగింది. అదే కాంగ్రెస్ 8 స్ధానాలు గెలిచింది, మరోక బీజేపీ అభ్యర్ధి సపోర్ట్ కూడా ఉండటంతో బలం 9కి పెరిగిపోయింది. ఎమ్మెల్యే ఓటుతో కలిపి కాంగ్రెస్‌కు బలం 10కి చేరింది. చైర్మన్ దక్కించుకోవాలంటే కాంగ్రెస్‌కు ఇంకా మూడు స్ధానాలు కావాలి. ఆ మూడు స్ధానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆకుల యాదగిరికి కాంగ్రెస్ గాలం వేసినట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ఆకుల యాదగిరికి కాంగ్రెస్ పార్టీ వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి బీఆర్ఎస్ అభ్యర్ధులతో కలిసి వస్తే చైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆశ చూపించింది. ఆ యాదగిరి చైర్మన్ పదవి తమకు అప్పగించాలని బీఆర్ఎస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ చైర్మన్ పదవి ఇవ్వకపోతే బయటికి వెళ్లిపోతానని ఆకుల యాదగిరి నేతలపై ఓత్తడి పెంచుతున్నట్లు పట్నంలో చర్చ సాగుతుంది. యాదగిరిపై పెట్టుకున్న కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయా లేదా అని వేచిచూడాలి.
మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అత్యధిక సంఖ్యలో మున్సిపాలిటీ పరిసరా ప్రాంతాల్లోకి చేరుకోవడంతో ఉదృక్తత వాతవారణం నెలకొంది. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు, నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. క్యాంపులల్లో ఉన్న కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగానే పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రాంతం కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ క్యాంపులోనున్న ఆకుల యాదగిరి చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండటంతో ఆ కుటుంబ సభ్యులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. దీంతో ఆ ప్రాంతం చేజారిపోతుందని పోలీసులు గమనించి మరింత బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికి ముగ్గురు అఘంతకులు మున్సిపాలిటీ కార్యాలయంపైకి రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లను అదుపులోకి తీసుకోని పోలీసులు స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.
సోమవారం జరగాల్సిన ఎన్నిక ఉదృక్త పరిస్థితి ఉండటంతోనే మంగళవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఫోర్త్‌సిటీ కమీషనర్ సుధీర్ బాబు సైతం నేటి ఎన్నికకు గట్టిబందోబస్తు ఏర్పాటు చేయాలని స్ధానిక ఏసీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజాస్వామ్య బద్దంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టు వ్యహారించాలని అటు పోలీసులు, ఇటు ఎన్నిక పరిశీలకులు ప్రణాళికలు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో వాయిదా పడిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. హంగు ఉందని అధికార పార్టీ చైర్పర్సన్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ వ్యవహారించాలని ఎత్తుగడలు వేస్తుంది. అందులో భాగంగానే ఇబ్రహింపట్నం మున్సిపాలిటిలో చైర్మన్ ఎన్నికను దక్కించుకునేందుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూరీ రాజులను ఇంచార్జీలుగా నియామించారు. అధికార పార్టీ వ్యూహాలను తిప్పికోట్టేందుకు బీఆర్ఎస్ సిద్దంగా ఉండాలని అధిష్టానం సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి