E-Paper
Advertisement

Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy: శివుని అనుగ్రహంతోనే ఎల్లంపేట మున్సిపాలిటీ కైవసం : మాజీ మంత్రి మల్లారెడ్డి
Advertisement

Mallareddy: అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపేటతో పాటు మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు పలు కుటిల ప్రయత్నాలు చేసిందని మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి (Mallareddy) ఆరోపించారు. ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మల్లారెడ్డి విమర్శించారు. అయినప్పటికీ శివుడి అనుగ్రహం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎల్లంపేట, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ మద్దతు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.

Also Read: Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?

మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ ఆధిపత్యం

Advertisement

ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్‌గా శ్రీదేవి, వైస్ చైర్మన్‌గా బీజేపీకి చెందిన మేకల రజిత ఎన్నిక కావడం ద్వారా మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ ఆధిపత్యం నిలిచిందన్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్‌ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీని రాష్ట్రంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సమిష్టిగా కృషి చేస్తారని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Also Read: Kadiyam Srihari: ఘనపూర్‌లో గెలిచిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×