E-Paper
Advertisement

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!
Advertisement

Mission Bhagiratha: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది పైప్‌లైన్‌కు అక్రమంగా మోటార్లు బిగించి అధికంగా నీటిని లాగుతున్నారని, దీంతో మిగిలిన కాలనీవాసులకు తగినంత నీరు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మోటార్ల ద్వారా కొందరు నీటిని లాగేయడంతో పైప్‌లైన్‌లో నీటి ఒత్తిడి తగ్గి, కాలనీలోని అనేక ఇళ్లకు చుక్క నీరు కూడా చేరడం లేదని వాపోతున్నారు. ప్రతి రోజు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదని తెలిపారు.

Advertisement

అక్రమంగా మోటార్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల మౌలిక అవసరమైన తాగునీటి విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.అక్రమంగా మోటార్లు బిగించి నీటిని లాగుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికీ సమానంగా అందేలా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

Tags

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×