E-Paper
Advertisement

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !
Advertisement

IBPS Clerk recruitment 2026: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి  నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతే కాకుండా ఈ విడతలో మొత్తం 11,403 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు, అర్హతలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 11,403 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అంతే కాకుండా ఈ పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి: సాధారణంగా అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ రిజర్వేషన్ వర్గాల వారికి వయోసడలింపు వర్తిస్తుంది.

Advertisement

ఎంపిక విధానం :
బ్యాంక్ క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది. అభ్యర్థులు ప్రధానంగా రెండు దశల పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష: ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అంతే కాకుండా ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ , రీజనింగ్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

మెయిన్స్ పరీక్ష:  ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. దీని ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.

Also Read: టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

అప్లికేషన్ విధానం, ముఖ్యమైన తేదీలు:
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్ట్ 1నుంచి ప్రారంభమైంది. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఆగస్ట్ 21లోపు పూర్తి చేయాలి.

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.175, ఇతరులకు రూ.850 ఫీజు ఉంటుంది.

అప్లికేషన్ సమయంలో అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

Related News

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

హనీమూన్‌లో దంపతుల మధ్య మంటలు.. నవ వధువుకి తీవ్రగాయాలు, డార్జిలింగ్‌లో ఘటన

స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీలు.. గ్రూప్ CISO జాబ్స్.. రూ.2.5 కోట్ల వరకు సాలరీ

31 ఏళ్ల క్రితం రూ.100 లంచం తీసుకున్న ఉద్యోగికి ఇప్పుడు జైలు శిక్ష.. కోర్టు విచిత్ర తీర్పు

76వ పుట్టినరోజు వేళ.. మోదీపై జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్.. ఇంతకీ ఏమన్నారంటే?

వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

Big Stories

Advertisement
×