E-Paper
Advertisement

Sand Mafia: ముడుపుల మత్తులో మైనింగ్, పోలీస్ శాఖలు.. గద్వాల్లో జోరుగా ఇసుక దందా..!

Sand Mafia: ముడుపుల మత్తులో మైనింగ్, పోలీస్ శాఖలు.. గద్వాల్లో జోరుగా ఇసుక దందా..!

Sand Mafia: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇసుక మాఫీయా బరితెగిస్తున్నారు. కొన్నాళ్లు కనిపించి కనిపించనట్టు లోలోపల సాగిన అక్రమ దందా ప్రస్తుతం బహిరంగంగా మారిపోయింది. అక్రమ ఇసుక రవాణకు పోలీస్,‌మైనింగ్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు తమ ఆగడాల్ని పెంచేస్తున్నారు.

రాత్రి వేళలో అక్రమ‌ ఇసుక..

తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాత్రివేళలో పదుల సంఖ్యల టిప్పర్ లు జాతీయ రహదారిపై రయ్ రయ్ మంటూ దారిపోంటి గద్వాల జిల్లాకు వరుస కడుతున్నాయి. పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్ లు. దర్జాగా దారి పొడుగున మసక మసక చీకట్లో ఈ వ్యవహారం నిత్యం కొనసాగుతున్నా ఒక్క పోలీసు ఈ వాహనాలవైపు కన్నెత్తి చూడటం లేదు. మాట వరుసకైనా ఈ దందా ఏంటని ఆరా తీసిన సందర్భం లేదు. ముందస్తు అంగీకారం ప్రకారం కొన్ని పోలీస్ స్టేషన్ ల మీదుగానే రాత్రి వేళలో అక్రమ‌ ఇసుక రవాణ జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని అధికారులకు ఫోన్‌లలో సమాచారం ఇద్దామనుకుంటే అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. ఇటీవల ఓ‌ పోలీస్ స్టేషన్ లో రాత్రి వేళలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీసులు పట్టు కుని వదిలేసినట్లు ఆ మండలంలో చర్చనీయాశంగా మారింది.

ఏపీ టూ తెలంగాణ

ఏపీలోని కర్నూల్ ,మంత్రాలయం, నాగల్ దిన్నె ప్రాంతాల తుంగభద్రా నదీతీరం నుంచి‌ ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఇసుక మాఫీయా లీడర్లు రాత్రివేళలలో జోగుళాంబ గద్వాల జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి పన్నులు చెల్లించకుండా తరలిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు. ప్రధానంగా కర్నూల్ జిల్లా గద్వాల జిల్లా మద్య అంతరాష్ట్ర చెక్ పోస్టు మీదుగా అక్రమ ఇసుక రవాణ జరుగుతున్న జిల్లా‌మైనింగ్ , పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే‌ కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో తుంగభద్ర, కృష్ణానదీ తీరాల‌‌ నుంచి టిప్పర్ ల ద్వారా ఇసుకను అక్రమంగా అయిజ,‌గట్టు, కేటిదొడ్డి, ధరూర్ మండలాలకు రాత్రివేళలో ఆయా పోలీస్ స్టేషన్ ల మీదుగా తరలిస్తున్నారు. గట్టు, కేటిదొడ్డి మండలాల శివారు గ్రామాలలో ఇసుకను డంపులు నిలువ చేసి అక్కడ నుంచి అక్రమ రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దందా సాఫీగా నడవడానికి అధికారులకు మాముళ్లు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Also Read: Delimitation: డీ లిమిటేషన్ అంశంతో నేతల్లో టెన్షన్ టెన్షన్.. పాత నాయకులకు చుక్కలేనా..?

ఏపీలో ఉచితం.. తెలంగాణలో డిమాండ్!

ఏపీలో 20టన్నుల ఇసుక రూ.3,500-రూ.4,000 మద్య లభిస్తుండటంతో ఇసుక మాఫియాకు వరంగా మారింది. ఏపీ రాష్ట్రానికి చెందిన ఇసుక మాఫీయా గద్వాల జిల్లా ఇసుక బ్రోకర్ల ద్వారా ఏపీ ఇసుకను టిప్పర్ ల ద్వారా గద్వాల పట్టణంతో పాటు మారుమూళ్ల గ్రామాలకు తరలిస్తున్నారు. గద్వాలలో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో కర్నూల్, గద్వాల జిల్లా అక్రమార్కులు ఆంద్ర ఇసుక మాఫీయా క్యాష్ చేసుకునేందుకు, రాత్రికి రాత్రే భారీ టిప్పర్ ల ద్వారా గద్వాల జిల్లాకు తరలిస్తు కోట్లు గడిస్తున్నారు. గద్వాల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల మీదుగా టిప్పర్ ల ద్వార అక్రమ ఇసుక రవాణ చేస్తున్న అధికారులకు ముడుపులు అందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కర్నూల్, గద్వాలకు చెందిన ఇసుక మాఫీయా నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం.

అక్రమార్కులదే పై చేయి..

కర్ణాటకలోని తుంగభద్రనదీ తీరాన ఉన్న చికలపర్వి క్యాంపు వద్ద, ఏపీలోని గుర్రాల దొడ్డి, కాచాపురం వద్ద‌ ఉన్న ఇసుక రీచుల నుంచి *టన్నుకు రూ.200(రెండు వందల రూపాయలు) చెల్లించి పెద్ద టిప్పర్ ల ద్వారా గట్టు, కేటిదొడ్డి మండలాలో అటవీప్రాంతంలో డంపులుగా నిలువ చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి గద్వాల, అయిజ, గట్టు, కేటిదొడ్డి, ధరూర్ మండలాలకు టిప్పర్ ల ద్వారా తరలించి *23 టన్నుల లోడ్ ను 35,000 -40,000* వరకు విక్రయించి తమ జేబులు నింపుకుంటున్నారు‌‌. ఇసుక తరలింపులో అక్రమార్కులదే పై చేయిగా ఉందని చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రాత్రివేళలో గద్వాల, గోనుపాడు, సంగాల, వీరాపురం, ధరూర్ లో పెద్ద మొత్తంలో ఇసుక వ్యాపారులు ఈ వ్యాపారంలో ఆరితేరారు. ఇది‌ఇలా ఉండగా ఇసుక టిప్పర్లు గట్టు, కేటిదొడ్డి, మల్దకల్, గద్వాల మండలం పోలీస్ స్టేషన్ మీదుగా తరలిస్తున్న స్థానిక పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం గద్వాల్ నియోజకవర్గంలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ లను పోలీసులు పట్టుకుని వదిలినట్లు జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది.

సరిహద్దులో అక్రమ ఇసుక డంపులు

తెలంగాణ,‌కర్ణాటక రాష్ట్రాల‌ సరిహద్దును ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణకు తెరలేపారు. ఏపీలోని మంత్రాలయం వద్ద తుంగభద్రనదీ, కర్ణాటక రాష్ట్రా కృష్ణానదీ తీరాల నుంచి టిప్పర్ ల ద్వారా అక్రమంగా తెచ్చుకున్న ఇసుకను పట్టపగలే గద్వాల్ జిల్లా గట్టు, కేటిదొడ్డి, అయిజ మండలాల సరిహద్దుల్లో డంపులు చేస్తున్నారు. అక్కడ నుంచి టిప్పర్లలో రాత్రికి రాత్రికే గట్టు, కేటిదొడ్డి, అయిజ, ధరూర్ మండలాలకు తరలిస్తున్నారు. ఇందుకు అధికారుల అండదండలు మెండుగా ఉండడంతో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఓవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని మొత్తుకుంటున్నా అక్రమార్కులు, అధికారులు వాటిని తుంగలో తొక్కేస్తున్నారు.

Also Read: Water Crisis: నిప్పులు చెరుగుతున్న భానుడు.. కంటికి కనిపించని చలివేంద్రాలు

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×