E-Paper
Advertisement

Water Crisis: నిప్పులు చెరుగుతున్న భానుడు.. కంటికి కనిపించని చలివేంద్రాలు

Water Crisis: నిప్పులు చెరుగుతున్న భానుడు.. కంటికి కనిపించని చలివేంద్రాలు
Advertisement

Water Crisis: స్వేచ్ఛ బ్యూరో: మార్చి నెలలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నా, ప్రజల దాహార్తిని తీర్చాల్సిన మున్సిపల్ యంత్రాంగం మాత్రం ‘మొద్దునిద్ర’ పోతోంది. ప్రతి ఏటా వేసవి కాలం ప్రారంభంలోనే ఏర్పాటు చేయాల్సిన చలివేంద్రాల ఊసే ఎత్తకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గాలికి వదిలేసిన ప్రజా సౌకర్యాలు

గతంలో వేసవి కాలం రాగానే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని కీలక ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా ప్రధాన బస్టాండ్ ఆవరణ, అంబేద్కర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం ఎదుట వంటి రద్దీ ప్రాంతాల్లో కుండలతో నీటి సౌకర్యం కల్పించేవారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, నిరుపేద కూలీలు, చిరు వ్యాపారులు తమ దాహాన్ని తీర్చుకునేవారు. కానీ, ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సౌకర్యాలను గాలికొదిలేసిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Also Read: Delimitation: డీ లిమిటేషన్ అంశంతో నేతల్లో టెన్షన్ టెన్షన్.. పాత నాయకులకు చుక్కలేనా..?

కొనే స్తోమత లేక.. అల్లాడుతున్న పేదలు

బయట వాటర్ బాటిళ్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఎండలో తిరిగే పేదలు, సామాన్యులు నీటిని కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిస్థితులను చూడాలని స్థానికులు కోరుతున్నారు. “ఎండలు ముదురుతున్నా అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణం. వెంటనే ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాంమని హుజూరాబాద్ వాసులు డిమాండ్ చేసారు.

Advertisement

Also Read: Bellamkonda srinivas wedding: బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కావ్య పెళ్లి పిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×