E-Paper
Advertisement

రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?

రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?

Sand Smuggling: స్వేచ్ఛ బ్యూరో: ఏ.పి.లో ఇసుకను ఉచితంగా లారీల్లో నింపుకుని ఖమ్మంలోని పలు ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్. ఖమ్మం జిల్లా కు ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కడప గ్రామానికి చెందిన పాటిబండ్ల పార్ధసారది చౌదరి అనే వ్యక్తి ఏ.పి ఇసుకను దారి మళ్ళించి, తనకు ఉన్న 3 లారీల ద్వారా కొవ్వూరు గోదావరి నది ఇసుక ర్యాంప్ నుండి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సరిహద్దు మండలాలైన సత్తుపల్లి, వేంసూర్ తదితర ప్రాంతాల్లో విక్రయాలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా, ఆర్గనైజ్డ్ పద్ధతిలో మధ్యవర్తులను పెట్టుకుని అక్రమ ఇసుక దందా చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తుండడంతో నిందితుడు చౌదరి ని పలుమార్లు పట్టుకొని ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశారు.

మధ్యవర్తి తో కలిసి..

అయినా ఇతను పద్ధతి మార్చుకోకుండా మార్చి 30న తన ఎ.పీ. 16 టి.జె. 4888 లారీలో కొవ్వూరు గోదావరి నది ఇసుక ర్యాంప్ లో ఇసుకను లోడ్ చేసుకొని అక్రమంగా విక్రయించ సాగాడని అతని లారీ డ్రైవరు ఈదర విష్ణువర్ధన్ ద్వారా, కల్లూరుగూడెం గ్రామానికి చెందిన మధ్యవర్తి తో కల్సి ఇసుకను అమ్ముతుండగా, వేంసూర్ ఎస్ఐ కవిత, తన సిబ్బంది ఇసుక లారీసహా డ్రైవర్ ను పట్టుకొని విచారించగా, పాటిబండ్ల పార్థసారథి, మధ్యవర్తి ఆముదాలమధుల ప్రమేయం బయట పడడంతో వారి పై చీటింగ్, ఆర్గనైజేడ్ క్రైమ్ క్రింద కేసు నమోదు చేశారు. నిందితుడు పాటిబండ్ల పార్ధసారది చౌదరి తప్పించుకొని తిరుగు చుండగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు హైదరాబాదు రామోజీ పిల్మ్ సిటీ దగ్గరలో పార్ధసారది చౌదరిని, కల్లూరుగూడెం వద్ద ఆముదాలమధుని మంగళవారం అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టుకు హాజరు పర్చినట్లు సత్తుపల్లిరూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తులింగం తెలిపారు .

అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఐదు లారీలు సహా జేసీబీ సీజ్ చేసిన పోలీసులు

పట్టుబడిన ఇసుక అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.కేసులకు బెదరడం లేదు. ఇసుకాసురులు బరి తెగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో కేసుల నమోదు విషయం మరువకముందే ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఘటనలు నమోదవడం గమనార్హం .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులుఅక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో 5 లారీలు, ఒక జేసిబీ ను సీజ్ చేశారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలను, దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీ, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లారీలు, ఒక జెసీబీను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు.

Also Read: లేటెస్ట్ సినిమాలపై ఆశపడి 1.75 లక్షలు పోగొట్టుకున్న అమాయకుడు.. ఎలానో తెలిస్తే మీరు షాక్..?

గోదావరి నది ఇసుక ర్యాంప్ లనుండి..

సారపాక సమీప గోదావరి నది పై బ్రిడ్జి కింద ప్రాంతం నుంచి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. ఇక్కడ సుమారు 15 ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా జరిగింది. రెవెన్యూ , పోలీసులు వెంటపడితే అక్రమాలకు చెక్ పడుతుంది. లేదంటే ఖరా మామూలే. ఈ అక్రమ ఇసుక రవాణా కొందరు అధికార పార్టీ నాయకులమని చెప్పుకునే వ్యక్తులు నడిపిస్తున్నట్లు సమాచారం.ఈ ఇసుక తోడేళ్లు రాత్రింబవళ్లు ట్రాక్టర్లు, లారీలు నడిపిస్తూ కోట్ల రూపాయల ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీలోని మైనార్టీ పాఠశాల వద్ద స్కూల్ గోడ పక్కనే నిల్వ ఉంచిన ఇసుక ను జేసీబీలతో తవ్వి, పదుల సంఖ్యలో ట్రాక్టర్ల తో బైయట ప్రాంతాలకు డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచే లారీలకు లోడ్ చేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ ఇసుక మాఫియా గ్యాంగ్ దౌర్జన్యం కొనసాగుతోంది. జేసీబీలు, ట్రాక్టర్లు, లారీల మోతతో ఆ ప్రాంతం లో చెలరేగి పోతున్నారు. ఇద్దరు వ్యక్తుల కనుసన్నల్లోనే ఈ మొత్తం దందా నడుస్తోందని స్థానికులు బహిరంగం గానే ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా పోలీస్ బాస్ ప్రతిరోజూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా..కేసులు సైతం నమోదు చేయిస్తున్నప్పటికీ బూర్గంపహాడ్ మండలంలో ఇసుక తోడేళ్ల దౌర్జన్యాలు తగ్గడం లేదని అంటున్నారు .

మండల కేంద్రంలో ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

బూర్గంపహాడ్, సోంపల్లి మధ్యలో గల కిన్నెరసాని ఇసుక ర్యాంప్ నుండి నడుస్తున్న( T.S.M.D.C ఆన్ లైన్) లారీలు బూర్గంపహాడ్ రోడ్డు మీదుగా తరలిస్తుం డడంతో రోడ్డు మొత్తం గుంతలు పడుతున్నదని, నిత్యం ఈప్రాతంగుండా పనులకు వచ్చేవారు ప్రమాదకరమైన స్థితిలో రోజులు గడుపుతున్నారని, ఇసుక ర్యాంప్ కు వెళ్లే వాహనాలు నిత్యం ఇక్కడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగే విధంగా రోడ్డు పై లారీలు ఆపడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు గ్రామస్థులకు సర్ది చెప్పి లారీలను అక్కడి నుండి పంపించిన ఘటనలు న్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోని అక్రమ ఇసుక తోడేళ్ల చర్యలకు చెక్ పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని గ్రామీణ ప్రాంతప్రజలు కోరుతున్నారు.

Also Read: కుటుంభం కోసం బ్రాందీ బాటిల్ల ఎజెంట్‌గా మారిన విద్యార్థి..!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×