E-Paper
Advertisement

గద్వాల్లో పట్టపగలే ఇసుక అక్రమ దందా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

గద్వాల్లో పట్టపగలే ఇసుక అక్రమ దందా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
Advertisement

Sand Smuggling: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి ధరూర్‌, గట్టు మండలాలో‌అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణ చేస్తుండటం విశేషం. జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం నుంచి నిత్యం టిప్పర్ లు, ట్రాక్టర్ ల ద్వారా ఇసుక వ్యాపారులు‌ అక్రమ ఇసుక రవాణ చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. పట్టపగలే టిప్పర్ లు, ట్రాక్టర్ ల ద్వారా కర్ణాటక నుంచి గద్వాల జిల్లాకు తరలిస్తున్నారు. అక్రమార్కులకు కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతో ఒక‌ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాన్నా ఆరోపణలున్నాయి.

అధికారులు మౌనం..?

కర్ణాటక రాష్ట్రం నుంచి‌ తుంగభద్రనదీ తీరంలో గల ఇసుక రీచ్ ల నుండి టిప్పర్ ల ద్వారా ఇసుకను‌ గద్వాల్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారు. గట్టు, కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ ల మీదుగా ఈ అక్రమ రవాణ జరుగుతున్న జిల్లా మైనింగ్, పోలీస్ శాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గట్టు, కేటిదొడ్డి‌ మండలాలో టిప్పర్ ల ద్వార తెచ్చిన ఇసుక‌ను డంపులుగా నిలువ చేసి అక్కడి‌ నుంచి ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ అక్రమ దందాకు సూత్రధారులనే ఆరోపణలున్నాయి. పోలీస్ అధికారులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడంతో ఇసుక వ్యాపారులకు హద్దే లేదంటూ వ్యవహరిస్తున్నారు.

Advertisement

Also Read: గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

ఇష్టారాజ్యంగా దందా..

రాయచూర్ జిల్లా కృష్ణానదీ తీరం ఉన్న గ్రామాల నుంచి ట్రాక్టర్ ల ద్వారా పట్ట పగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. కేటిదొడ్డి,‌ ధరూర్ మండలాలో పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ధరూర్, కేటిదొడ్డి మండలాలోని పలు గ్రామాలకు అక్రమార్కులు అదును చూసి ఇష్టారాజ్యంగా ట్రాక్టర్ ల ద్వారా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇసుక అక్రమ రవాణ పై పలు వార్తపత్రికలలో వరుస కథనాలు వెల్లవడిన కూడా జిల్లా మైనింగ్ ,పోలీస్ ,‌రెవెన్యూ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్రమ ఇసుక రవాణ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Also Read: హైడ్రా ఎంట్రీతో టౌన్ ప్లానింగ్ బండారం బట్టబయలు.. మరీ ఇంత దారుణమా..?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×