తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భగ్గున మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత వేసవిలో తొలిసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఈ హెచ్చరిక ఇచ్చింది. ఈ అలర్ట్ తీవ్రమైన వేసవికి సంకేతం అని వెల్లడించింది. మార్చి 16 వరకు కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది..
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలోని పలు జిల్లాలపై వడగాల్పుల ప్రభావం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల మీద ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడించిది. రానున్న వారం రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు వివరించింది. తాజాగా ఆదిలాబాద్ లో అత్యధికంగా 39.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కుమురం భీమ్, ఆదిలాబాద్, మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు వేసవి కాలంలో తెలంగాణపై తీవ్ర వేడిగాలులు ఉంటాయని చెప్పేందుకు నిదర్శనం అని ఐఎండీ అభిప్రాయపడింది.
తెలంగాణ వెదర్ మ్యాన్ ఏమన్నారంటే?
అటు తెలంగాణ వెదర్ మ్యాన్ టి బాలాజీ సైతం రాష్ట్రంలో వేసవి ప్రభావం గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ రోజు నుంచి వేడి గాలులు మొదవుతాయన్నారు. తగిన జాగ్రతతలు తీసుకోవాలని సూచించారు. “ ఈరోజు నుంచి వేడిగాలులు మొదలవుతాయి. హైడ్రేటెడ్ గా ఉండండి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకండి” అని తెలిపారు.
Heatwave to start from today. Stay hydrated, avoid going out during afternoon hours 👍
— Telangana Weatherman (@balaji25_t) March 12, 2025
వేసవి నేపథ్యంలో ఐఎండీ కీలక సూచనలు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వేడి తీవ్ర పెరుగుతుందని ఐంఎండీ అంచనా వేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, LB నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లితో సహా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వెల్లడించింది. తాజాగా హైదరాబా ద్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఆసిఫ్ నగర్ లో 36.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఖైరతాబాద్, గోల్కొండ, మారేడ్ పల్లి, ముషీరాబాద్, షేక్ పేట్, నాంపల్లి, బండ్లగూడ, అంబర్ పేట్ లాంటి ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ వేసవిలో తొలిసారి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Read Also: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇలా చుక్కలు చూపించండి.. సజ్జనార్ సలహా!
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలన్నారు. ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ, లెమన్ వాటర్, అప్పుడప్పుడు ఓఆర్ఎస్ తాగాలని సూచించారు. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలన్నారు. ఎండలు అధికంగా టైమ్ లో వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడం మంచిదన్నారు. ఉదయం, సాయంత్రం సమయంలోనే బయట పనులు చూసుకోవాలన్నారు.
Read Also: మా ఆడోళ్లు తాగుబోతులయ్యారు.. కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తలు!