Pelli Kani Prasad Trailer: టాలీవుడ్ యంగ్ కమెడియన్ సప్తగిరి గురించి అందరికీ తెలుసు. ఇప్పటివరకు అయినా పలు చిత్రాల్లో కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కామెడీతో కడుపుబ్బ నవ్విస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మార్కును క్రియేట్ చేసుకున్నాడు.. గతంలో కమెడియన్ సప్తగిరి హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు అనుకున్న ఫలితం ఇవ్వలేకపోయినా హీరోగా తన నటనకు మార్కులు పడ్డాయి.. తాజాగా మరో సినిమాలో ప్రధాన పాత్రలో సప్తగిరి నటిస్తున్నాడు.. ఆ సినిమా పేరు పెళ్లి కానీ ప్రసాద్.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాలకే ట్రెండ్ అవుతుండడం విశేషం. మరి ఆ ట్రైలర్ లోని హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 21 మార్చి 2025న గ్రాండ్ రిలీజ్ కోసం నిర్ణయించబడింది.. మొన్నీమధ్య సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో..ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా కుటుంబం ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది.. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పాలి.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్లే ఈ ట్రైలర్లో సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయని చెప్పాలి.. పెళ్లి కోసం ఒక యువకుడు పడే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. పెళ్లిచూపుల్లో జరిగే కామెడీ సీన్లు ట్రైలర్ కు హైలెట్ అయ్యాయనే చెప్పాలి.. కామెడీ డైలాగులతో పాటు వైలెంట్ డైలాగులు కూడా ఉంటాయని తెలుస్తుంది. మొదటినుంచి కామెడీగా సాగిన ట్రైలర్ కాస్త చివరికి వెళ్లేలోగా తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడక పెడతానంటూ ట్రెండింగ్ టాపిక్ ని వాడుకున్నారు. సినిమా కామెడీ తో పాటు వైలెన్స్ సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మరి సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో తెలియాలంటే మార్చి 21 వరకు వెయిట్ చేయాల్సిందే..
Also Read:హైదరాబాద్ కి వస్తున్న వార్నర్… నితిన్ భలే ప్లాన్ చేశాడు భయ్యా..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కై బాబు భను ప్రకాష్ గౌడ్ సుక్కా వెంకటేశ్వర్ గౌడ్ మరియు వైభవ్ రెడ్డి ముథయాలా ప్రతిష్టాత్మకమైన రీతిలో బ్యాంక్రోల్ చేశారు. ఈ చిత్రంలో సపగిరి సరసన ప్రియాంక శర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి సుజాతా సిద్దార్త్ సినిమాటోగ్రఫీ, షెకర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.. గతంలో సప్తగిరి నటించిన సినిమాలు పరవాలేదు అనే టాక్అందుకున్నాయి.. మరి ఈ సినిమాతో అయినా సక్సెస్ స్టాప్ ని అందుకుంటాడేమో చూడాలి…