BigTV English

TeamIndia Father And Son Cricketers: భారత క్రికెట్ జట్టులో ఆడిన తండ్రీ కొడుకులు వీరే!

దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటాడు. కానీ ఆ కోరిక నిజం చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. అలా అందివచ్చిన అదృష్టాన్ని ఎంతో కష్టపడి ఎనలేని కీర్తి, పేరు ప్రఖ్యాతలు సాధించేవారు చరిత్రలో నిలిచిపోతారు. అలా భారత దేశం తరపున క్రికెట్ ఆడిన వాళ్లలో కొంతమంది తండ్రీ కొడుకులు కూడా ఉన్నారు.

TeamIndia Father And Son Cricketers: భారత క్రికెట్ జట్టులో ఆడిన తండ్రీ కొడుకులు వీరే!

TeamIndia Father And Son Cricketers| దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటాడు. కానీ ఆ కోరిక నిజం చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. అలా అందివచ్చిన అదృష్టాన్ని ఎంతో కష్టపడి ఎనలేని కీర్తి, పేరు ప్రఖ్యాతలు సాధించేవారు చరిత్రలో నిలిచిపోతారు. అలా భారత దేశం తరపున క్రికెట్ ఆడిన వాళ్లలో కొంతమంది తండ్రీ కొడుకులు కూడా ఉన్నారు.


నటుడు సైఫ్ అలీ ఖాన్ తండ్రి, తాత: పటౌడీ రాజవంశానికి చెందిన నవాబ్ ముహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ.. 1946లో భారత క్రికెట్ జట్టు తరపున ఇంగ్లండ్ తో మూడు టెస్టులు ఆడాడు. విచిత్రం ఏమిటంటే 1932-34 మధ్య ఈయనే ఇంగ్లండ్ తరపున మూడు టెస్టు మ్యాచ్ లు ఆడాడు. అలా ఇంగ్లండ్, భారత్.. రెండు దేశాల జట్లలో ఆడిప ఏకైక క్రికెటర్ గా ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ పేరున రికార్డ్ ఉంది.


ఆయన తరువాత ఆయన కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తన తండ్రి అడుగుజాడల్లో ఇండియా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. మన్సూర్ అలీ ఖాన్ 46 టెస్టుల్లో 2739 పరుగులు చేశాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ఈయన స్వయాన తండ్రి.

Also Read: టీమిండియా శ్రీలంక పర్యటన.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

లాలా అమర్ నాథ్ , మొహిందర్ అమర్ నాథ్: భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి సెంచరీ బాదిన క్రికెటర్ గా లాలా అమర్‌నాథ్‌ రికార్డు సృష్టించాడు. ఆయన 24 టెస్టుల్లో 878 పరుగులు చేశాడు. ఆయన కుమారుడు మోహిందర్ అమర్‌నాథ్‌ ఏకంగా ఇండియాకు ప్రపంచ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1983లో ఇండియా తొలి ప్రపంచ కప్ గెలుచుకుంది. మోహిందర్‌ అమర్‌నాథ్‌ భారత్ జట్టు కోసం 69 టెస్టులు, 85వన్డేలు ఆడాడు.

మంజ్రేకర్ ద్వయం: 1952 -1965 మధ్య కాలంలో విజయ్ మంజ్రేకర్ భారత్ జట్టు తరపున ఆడాడు. మొత్తం 55 టెస్ట్ లలో ఆయన 3208 పరుగులు చేశాడు. విజయ్‌ మంజ్రేకర్ కుటుంబం నుంచి ఆయన కుమారుడు సంజయ్ మంజ్రేకర్ కూడా క్రికెటర్ అయ్యాడు. టీమిండియా కోసం ప్రాతినిధ్యం చేస్తూ.. 74 వన్డేల్లో 1994 పరుగులు, 37 టెస్టుల్లో 2043 పరుగులు చేశాడు.

సునీల్ అండ్ రోహన్ గవాస్కర్ : భారత క్రికెట్ దిగ్గజాలలో సునీల్ గవాస్కర్ కు ప్రత్యేక స్థానముంది. ఆయన పేరున ఎన్నో రికార్డులు ఉన్నాయి. 108 వన్డేలలో 3092 పరుగులు, 125 టెస్టులలో 10,122 పరుగులు సాధించాడు. అందుకే ఆయనను మాస్టర్ బ్లాస్టర్ అని పిలుస్తారు. ఆయన కుమారుడ రోహన్ గవాస్కర్ కూడా క్రికెటర్ గా ఎదిగాడు. కానీ రోహన్ తన తండ్రిలాంటి స్టార్ క్రికెటర్ కాలేక పోయాడు. టీమిండియా కోసం రోహన్ కేవలం 11 వన్డేలలో 151 పరుగులు చేశాడు.

యోగ్‌రాజ్‌ సింగ్‌-యువరాజ్‌ సింగ్‌: నేటి తరం క్రికెట్ అభిమానులలో యువరాజ్ సింగ్ పేరు వినని వారు ఉండరు. టీమిండియాలో లెజెండరీ ఆల్‌రౌండర్‌ స్థానాన్ని యువరాజ్ సింగ్ సాధించాడు. వరల్డ్‌కప్‌ విన్నింగ్ జట్టులో యువరాజ్‌ సింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌. ఇండియా కోసం ఆరు వన్డేలు, ఓ టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడగలిగాడు. అయితే క్రికెట్‌లో తాను సాధించలేని పేరుప్రఖ్యాతలను తన కొడుకు ద్వారా యోగ్‌రాజ్‌ సింగ్ సాకారం చేసుకున్నాడు.

Also Read: Champions Trophy 2025| ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే!.. 

రోజర్ అండ్ స్టువర్ట్ బిన్నీ: ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు.. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్‌ బిన్ని. ఆయన కుమారుడు స్టువర్ట్‌ బిన్ని కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. భారత్ తరపున రోజర్‌ బిన్ని 27 టెస్ట్ మ్యాచులు ఆడి 830 పరుగులు, 47 వికెట్లు తీశాడు. 72 వన్డేలలో 629 పరుగులు చేసి.. 77 వికెట్లు పడగొట్టాడు. ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ కేవలం 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ 20 మ్యాచ్​లు ఆడాడు.

సచిన్ టెండూల్కర్-అర్జున్ టెండూల్కర్: ఇండియాలో గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలవబడే అరుదైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 16 ఏళ్లకే క్రికెటర్ గా మారిన సచిన్ పేరున ఎన్నో రికార్డులున్నాయి. ఆ రికార్డులు చెప్పుకుంటూ పోతే.. ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది. భారత క్రికెట్ లో సుదీర్ఘ కాలం ఆడిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు.

 

Father Son Duo Cricketers In Team India

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×