E-Paper
Advertisement

Indira Solar Giri Jala Vikasam: రైతులకు ఫ్రీగా రూ.6 లక్షల విలువైన సోలార్ ప్యానెల్స్.. నెలకు రూ.5 వేల ఆదాయం

Indira Solar Giri Jala Vikasam: రైతులకు ఫ్రీగా రూ.6 లక్షల విలువైన సోలార్ ప్యానెల్స్.. నెలకు రూ.5 వేల ఆదాయం
Advertisement

Indira Solar Giri Jala Vikasam: తెలంగాణ ప్రభుత్వం చిన్న, సన్న కారు గిరిజన రైతుల కోసం అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తుంది. గిరిజన రైతుల వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు 100 శాతం సబ్సిడీతో రూ.6 లక్షల విలువైన సోలార్ ప్యానెల్స్ అందించనుంది. అలాగే వారికి నెలనెలా కొంత ఆదాయాన్ని పొందేలా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకం కింద కింద గిరిజన రైతులకు రూ.6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెల్స్ అందిస్తారు. ఈ ఖర్చు మొత్తం 100 సబ్సిడీతో ప్రభుత్వమే భరిస్తుంది. విద్యు్త్ పై రూపాయి ఖర్చు లేకుండానే రైతులు సాగునీరు పొందవచ్చు. విద్యుత్ విక్రయించడంతో ప్రతి నెలా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం కూడా లభిస్తుంది.

గతేడాది ప్రారంభం

ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకాన్ని గతేడాది మే నెలలో సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా గిరిజన రైతులకు సోలార్ ప్యానెల్స్ అందిస్తారు. ఈ ప్యానెల్స్ నుంచి ఉత్పత్తిని అయిన విద్యుత్ ను రైతు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అమ్ముకోవచ్చు. విద్యుత్ అమ్మకంతో రైతులు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం పొందవచ్చు.

అర్హులు ఎవరంటే?

Advertisement

ఈ పథకాన్ని అటవీ ప్రాంతాలు, విద్యుత్ సౌకర్యం సరిగ్గా లేని ఏరియాల్లో.. వ్యవసాయం చేసే రైతుల కోసం అమలు చేస్తున్నారు. అటవీ హక్కుల పత్రాలు కలిగి, 2.5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా రైతులు అటవీ హక్కుల పత్రాలు కలిగి ఉన్నారు. ఈ రైతులందరికీ విడతల వారీగా సౌర గిరి జల వికాస్ స్కీమ్ ద్వారా సోలార్ ప్యానెల్స్, పంపు సెట్లు అందించనున్నారు.

Also Read: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్లకు గుడ్ న్యూస్.. 35 శాతం సబ్సిడీతో రూ.50 లక్షల లోన్

మొదటి విడతలో 10 వేల మందికి లబ్ది

Advertisement

ఈ స్కీమ్ మొదటి విడతలో భాగంగా 10 వేల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు, ప్యానెల్స్ అందించనున్నారు. ఇందుకోసం నాబార్డ్ నుంచి రూ.600 కోట్ల రుణం సేకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు జత చేసి ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయనుంది. ఫిబ్రవరిలో ప్రక్రియను పూర్తి చేసి మార్చి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అన్ని జిల్లాల గిరిజన రైతులు అప్లై చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×