KA Paul: ఏకె పాల్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. సమయం, సందర్భం ఏంటో తెలీదు. కానీ ఓ విషయాన్ని బయటపెట్టారు. తనను ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారంటూ ఓ వీడియో బయటపెట్టారు ఆయన. ఇంతకీ ఆయన్ని అడ్డుకోవడానికి కారణాలేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. అమెరికా ప్రజలకు సుపరిచితుడు ప్రజా శాంతి చీఫ్ కేఏ పాల్. ట్రెండ్ అనుగుణంగా వార్తల్లోకి వస్తాయి. పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయనకు తిరుగులేదు. ఆ విధంగా పాపులర్ అయ్యారు కూడా. నిత్యం వార్తల్లో ఉండాలని భావించేవారు ఆయన కూడా ఒకరు. ఆయనకు లక్షల్లో అభిమానులు ఉన్నారనుకోండి. అది వేరే విషయం.
సందర్భం ఏంటోగానీ ఏకే పాల్‌ను ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. తాను అన్ని డాక్యుమెంట్లు చూపించినా ఎందుకు ఆపుతున్నారంటూ నిలదీశారు. ఈ మేసేజ్‌ను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. భారత్-పాక్ యుద్ధం ఆపేందుకు తాను టర్కీ వెళ్తున్నానన్నది ఆయన వెర్షన్. అయినా శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయం ఏకే పాల్‌కు ఇంకా తెలిసినట్టు లేదు.
అయినా ఇండో-పాక్ మధ్య వార్ ఆపేందుకు టర్కీ వెళ్లడం దేనికి? అన్నదే అసలు ప్రశ్న. గడిచిన నాలుగు రోజులుగా జరిగిన వార్ కోసం దాయాది దేశం పాకిస్థాన్‌కు డ్రోన్లు టర్కీ పంపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన టర్కీ వెళ్తున్నారని అంటున్నారు. బహుశా వాటిని పాకిస్తాన్‌కు ఇవ్వవద్దని ఆదేశ అధ్యక్షుడితో మాట్లాడేందుకు వెళ్తున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.
ALSO READ: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లేటెస్ట్.. లబ్ధిదారుల జాబితాలు సిద్ధం!
తాను 37 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు కేఏ పాల్. పోయినవారం తాను టర్కీలో ఉన్నానని అంటున్నారు. ఒకానొక దశలో తాను పాకిస్థాన్ వెళ్లాల్సివుందని అన్నారు. వీసా లేకుండా ప్రపంచ దేశాలను తనను ఆహ్వానిస్తాయని మనసులోని మాట బయటపెట్టారు. తన వీసా, గ్రీన్‌కార్డులను చూపించారు. బహుశా హడావుడిలో ఏదో డాక్యుమెంట్ తీసుకురావడం ఆయన మరిచిపోయి ఉండవచ్చని అంటున్నారు.
భారత్-పాక్ యుద్ధం ఆపేందుకు టర్కీ వెళ్తుంటే నన్ను అడ్డుకుంటున్నారు: కే.ఏ. పాల్
ఎయిర్ పోర్టులో కే.ఏ.పాల్ హల్ చల్
అన్నీ డాక్యూమెంట్లు ఉన్నా మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ అధికారులను నిలదీసిన కే.ఏ.పాల్ pic.twitter.com/hQ782EXPic
— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2025