E-Paper
Advertisement

Congress vs BRS: వడ్డీ లేని రుణాలపై.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్ల రాజకీయం

Congress vs BRS: వడ్డీ లేని రుణాలపై..  కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్ల రాజకీయం
Advertisement

Congress vs BRS: స్వేచ్ఛ, బ్యూరో: అసెంబ్లీలో వడ్డీలేని రుణాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఇచ్చామని కాంగ్రెస్ స్పష్టం చేస్తుంటే ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వివరాలు ప్రకటించినప్పటికీ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ససేమిరా అంటుంది. కేవలం తప్పుడు లెక్కలతో కాలం వెళ్లదీస్తుందని, రాజీనామాకు సిద్దమా అని సవాల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇదే చర్చ మహిళా సంఘాల్లోనూ జరుగుతుంది. ఇంతకు ఎవరిది కరెక్టు అనేదానిపై మహిళలు సైతం తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.

రూ. 12,445.92 కోట్లు

గత రెండుమూడ్రోజులుగా మహిళ వేదిక రాజకీయం నడుస్తుంది. రాష్ట్రంలోమహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందజేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటిమంది కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు భారీ స్థాయిలో రుణ సదుపాయం కల్పిస్తూ వారిని లక్షాధికారులుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2023 డిసెంబర్ నుంచి 2026 మార్చి నాటికి (ప్రస్తుత అంచనాల ప్రకారం) ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏకంగా రూ. 57,937.2 కోట్ల భారీ మొత్తాన్ని రుణాల రూపంలో అందజేసినట్లు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూతలో సింహభాగం గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలకే దక్కింది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 5 లక్షలకు పైగా సంఘాలకు రూ. 45,491.28 కోట్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని మహిళల కోసం రూ. 12,445.92 కోట్లు కేటాయించారు. ఏటా రుణాల సంఖ్యను పెంచుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నాలుగు నెలల్లోనే (డిసెంబర్ 23 – మార్చి 24) సుమారు రూ. 7,932 కోట్లు అందించగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది రికార్డు స్థాయిలో రూ. 27,557 కోట్లకు చేరింది. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం మార్చి 13 వరకు ఉన్న లెక్కల ప్రకారమే మరో రూ. 22,446 కోట్లు మహిళా సంఘాలకు చేరాయి.

Advertisement

Also Read: Iran War: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. చమురు క్షేత్రాల తర్వాత, నెక్ట్స్ ఇంటర్నెట్ కేబుల్స్? అప్పుడే ఆందోళనలు షురూ!

కాంగ్రెస్ హయాంలో పంపిణీ వివరాలు ఇవే:

కాలం గ్రామీణ మొత్తం (కోట్లలో) పట్టణ మొత్తం (కోట్లలో) మొత్తం రుణం (కోట్లలో) (2023-24 (డిసెంబర్-మార్చి) రూ. 7,101.98 రూ. 830.6 రూ. 7,932.58)  (2024-25 రూ. 21,446.37 రూ. 6,111.62 రూ. 27,557.99) 2025-26 (13.03.2026 వరకు) రూ. 16,942.93 రూ. 5,503.71 రూ. 22,446.64) మొత్తం రూ. 45,491.28 రూ. 12,445.92 రూ. 57,937.20 మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబం, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ప్రభుత్వం ఈ స్థాయి రుణాలను మంజూరు చేస్తోందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పట్టణ, గ్రామీణ తేడా లేకుండా మహిళా సంఘాలకు అండగా నిలుస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Advertisement

అయితే బీఆర్ఎస్ మాత్రం అబద్దమని పేర్కొంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20లక్షలకు పైగా సంఘాలు62లక్షల మంది మహిళా సంఘాల్లో సభ్యులు ఉన్నారు.57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని, అసెంబ్లీ వేదికగా తప్పుడు లెక్కలు చెబుతోందని వాదిస్తుంది. అంతేకాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 57వేలకోట్లు రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటామని, మాటకు కట్టుబడి ఉంటానని సవాల్ చేశారు. దీనిపై చర్చకురావాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అసెంబ్లీలో వడ్డీలేని రుణాలపై అబద్దాలు చెప్పారని .. వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామాకు ఎవరు ముందుకు వస్తారో చెప్పాలని సవాల్ చేశారు. అంతేకాదు మాజీ మంత్రి హరీష్ రావు వడ్డీలేని రుణాలపై సైతం చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. 5లక్షల వరకే వడ్డీలేని రుణాలు ఇస్తున్నారని, 5లక్షలకు పైగా తీసుకున్నవాటికి ఇవ్వడం లేదని, ఇది మహిళలను మోసం చేయడమేనని పేర్కొంటున్నారు. ఎలా 57వేలకోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చారో చెప్పాలని.. వేదిక చెబితే చర్చకు వస్తామని సవాల్ చేస్తున్నారు.

నిజంగా 57వేలకోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చారా?

మహిళల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిజంగా 57వేలకోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చారా? ప్రభుత్వం చెబుతున్నవాటా వాస్తవా? బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమా అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వం అంకెలతో చెబుతున్నప్పటికీ మహిళల్లో మాత్రం కొంత అనుమానాలకు దారితీస్తుంది. అయితే వాటిని నివృత్తిచేయాల్సిన అవసరం ఉంది. గ్రామస్థాయిలో మహిళలు కీలకం. ప్రభుత్వ పథకాలు అయినా.. ఎన్నికల్లోనైనా వారిదే ముఖ్యపాత్ర. అయితే ఇప్పుడు వడ్డీలేని రుణాలపై అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న వాదోపవాదాలు మహిళా సంఘాల సభ్యుల్లో చర్చతోపాటు హాట్ టాపిక్ అయింది.

3000 కోట్ల వడ్డీలను చెల్లించకుండా మోసం.. మంత్రి సీతక్క

మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం తో బతికే మహిళలకు మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. సోషల్ మీడియాలో దృష్నాచారం చేయడమే బీ ఆర్ ఎస్ పనిగా పెట్టుకుంది. పది సంవత్సరాల్లో బి ఆర్ ఎస్ ఎం చేసింది. 3000 కోట్ల వడ్డీలను మహిళలపై భారం మోపిందిబీఆర్ఎస్. మహిళలకు ఇవ్వాల్సిన 3000 కోట్ల వడ్డీలను చెల్లించకుండా మోసం చేసింది. ఇప్పటివరకు మహిళా సంఘాలకు ఈ రెండు సంవత్సరాల్లో 57 వేల కోట్ల రుణాలు ఇప్పించాం.

1390 కోట్లు ఇప్పటివరకు మహిళలకు వడ్డీలు

మహిళా రుణాలకు సంబంధించి 1390 కోట్లు ఇప్పటివరకు మహిళలకు వడ్డీలు చెల్లించాం. ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసి ఆదా చేసుకున్న అభ్యాస నిధులను గత ప్రభుత్వం కాజేసింది. ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నారు 10 సంవత్సరాల్లో చేశారు.గతంలో ఐదు లక్షల రుణాల వరకు వడ్డీలను లిమిట్ చేస్తూ హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు.ప్పుడు ఐదు లక్షల కు మించి రుణలకి కూడా వడ్డీలు చెల్లించాలని అడగటం విడ్డూరం.భవిష్యత్తులో ఐదు లక్షలకు మించి రుణాలకు కూడా వడ్డీలు చెల్లించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నాం.

Also Read: Romantic Movie OTT: పెళ్ళిరోజు పారిపోయే ప్రియుడు… ఫోటో గ్రాఫర్ తో ప్రేమ పాఠాలు… జీవితం చూపించే సినిమా

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×