BigTV English

Kaleshwaram: నేతల ఉక్కిరి బిక్కిరి..విచారణ ముందుకు హరీష్‌రావు, ఈటెల

Kaleshwaram: నేతల ఉక్కిరి బిక్కిరి..విచారణ ముందుకు హరీష్‌రావు, ఈటెల

Kaleshwaram: బీఆర్ఎస్‌కు ఈ ఏడాది కష్టాలు తప్పలేదు. ఒకటి తర్వాత మరొకటి ఆ పార్టీ కీలక నేతలను వెంటాడుతున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు కేటీఆర్. రేపో మాపో హరీష్‌రావును విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నేతల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.


బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. రోజుకో కేసు తెరపైకి రావడంతో నేతలు బెంబేలెత్తుతున్నారు. లేటెస్ట్‌గా కాలేశ్వరం బ్యారేజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ చేపట్టిన విచారణ క్లైమాక్స్ కు చేరుకుంది. తొలుత అధికారులను విచారించిన న్యాయవిచారణ కమిటీ, ఆ తర్వాత పైస్థాయి అధికారులు, ఇంజనీర్లు.. ఐఏఎస్‌ల వంతైంది.

ఇప్పుడు రాజకీయ నేతల వంతైంది. ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు జస్టిస్ పీసీ ఘోష్. గత ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన ఈటెల, హరీష్ రావులను విచారణకు పిలిచే అవకాశ మున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మించిన కంపెనీ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారుల సేకరించిన సమాచారాన్ని దగ్గరపెట్టి మాజీ మంత్రులను విచారించనుంది.


వీరి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ వంతు కానుందని సమాచారం. మొత్తం అందరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది పీసీ ఘోష్. ఆ తర్వాత రేవంత్ సర్కార్ దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించనుంది. ఆ తర్వాత నేతలు, అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సభకు వదిలేయాలని నిర్ణయించినట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: ఫార్ములా ఈ రేసు కేసు.. సేఫ్ గేమ్ ఆడిన బీఎల్ఎన్‌రెడ్డి

ఈ విచారణకు సంబంధించి తొలుత తొలుత కన్‌స్ట్రక్షన్, డిజైన్స్, క్వాలిటీ పర్యవేక్షణ, అకౌంట్స్ విభాగాలకు చెందినవారిని మాజీ అధికారులను విచారించింది. ఆ తర్వాత బ్యారేజీలకు నిధుల సేకరణపై దృష్టి పెట్టింది. అటు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వారు కమిషన్ ఎదుట హాజరైన పలు విషయాలు వెల్లడించారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×