Vishal:కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ (Vishal), వాస్తవానికి తెలుగు హీరో అయినప్పటికీ.. కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన, ఉన్నట్టుండి నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు.. చేతులు వనకడంతో విశాల్ కు ఏదో అయ్యిందని, చాలామంది రకరకాల వదంతులు సృష్టించారు. దీంతో కొంతమంది అభిమానులు తమ అభిమాన హీరోకి ఏమైంది? అని తెలుసుకోవడానికి సోషల్ మీడియా ద్వారా తెగ పోస్టులు పెట్టారు. ఇకపోతే విశాల్ ఆరోగ్యం పై లేనిపోని వదంతులు సృష్టిస్తే.ఊరుకోమని ఆయన అభిమాన సంఘం ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ కూడా హెచ్చరించింది.
దుష్ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమాన సంఘం..
పబ్లిసిటీ కోసం ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించడమే కాకుండా దయచేసి ఇలాంటి వదంతులు ఆపండి అంటూ వేడుకుంది విశాల్ అభిమాన సంఘం. ప్రజలు కూడా ఫేక్ న్యూస్ ని తిరస్కరించాలని, అసలు పట్టించుకోవద్దని కూడా అభిమాన సంఘం తెలిపింది. “ఈ క్రమంలోని విశాల్ ఆరోగ్యం పై అపోలో హాస్పిటల్ కూడా అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అయినా సరే కొంతమంది మా హీరో ఆరోగ్యం పై లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారు. మేము ఇలాంటి అసత్య వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాము. ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే మా అభిమాన నటుడి ఆరోగ్యంపై ఇలా తప్పుడు వార్తలు రాయడం తగదు. కొంతమంది తప్పుడు సమాచారంతోనే కథనాలు కూడా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పబ్లిసిటీ కోసం మీడియా ముసుగు వేసుకొని, ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ప్రజలు ఇలాంటి వార్తలను అసలు నమ్మకండి” అంటూ విశాల్ అభిమాన సంఘం విజ్ఞప్తి చేసింది.
విశాల్ ఆరోగ్యం పై స్పందించిన మేనేజర్..
ఇకపోతే దీని కంటే ముందే విశాల్ మేనేజర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ విడుదల చేశారు. అందులో..” విశాల్ వైరల్ ఫీవర్ , తీవ్రమైన ఒంటినొప్పులతో విపరీతంగా బాధపడుతున్నారు. ఆయనను విశ్రాంతి తీసుకోమని వైద్యులు కూడా సూచించారు. కానీ సినిమా ప్రమోషన్స్ కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈవెంట్ కు హాజరయ్యాడు. అయితే మీరు మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మకండి”.. అంటూ విశాల్ మేనేజర్ తెలిపారు.
విశాల్ ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన సెలబ్రిటీస్..
ఇకపోతే విశాల్ ఆరోగ్యం గురించి వార్తలు బాగా వైరల్ అవడంతో హీరో జయం రవి (Hero Jayam Ravi) ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ (Khushboo) కూడా విశాల్ ఆరోగ్యం పై స్పందించారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశాభవం వ్యక్తం చేశారు.
12 ఏళ్ల తర్వాత విశాల్ మూవీ విడుదల..
ఇదిలా ఉండగా.. 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ మూవీ ‘మదగజరాజ’ సినిమా ఇప్పుడు థియేటర్లలో విడుదల కాబోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రాబోతున్న ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ లుగా నటించారు. అలాగే సంతానం, సోనూ సూద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు విశాల్. అక్కడ గుర్తుపట్టలేనంతగా కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచారు ఈ క్రమంలోనే పలు రకాల దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.