E-Paper
Advertisement

గద్వాల్లో జోరుగా క్రికేట్ బెట్టింగ్ దందా.. 100 నుండి లక్ష వరకు పందెం కాస్తున్న రాయుళ్లు!

గద్వాల్లో జోరుగా క్రికేట్ బెట్టింగ్ దందా.. 100 నుండి లక్ష వరకు పందెం కాస్తున్న రాయుళ్లు!
Advertisement

IPL Betting: స్వేచ్ఛ బ్యూరో: క్రికెట్‌ క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ రెండు నెలలకు పైగా సాగే ఈ సంగ్రామాన్ని కొందరు వినోదం కోసం చూస్తుండగా మరికొందరు సులభంగా ఆదాయం సంపాదించే వనరుగా భావిస్తున్నారు. బంతి బంతికీ, ఓవర్ లు, స్కోర్ ల మీద బెట్టింగ్‌ పెట్టి డబ్బు సంపాదించాలని అత్యాశ పడుతున్నారు. ఈ ఊబిలో చిక్కుకొని చేసిన అప్పులు తీర్చలేక గతంలో గద్వాలలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు 70 లక్షల అప్పు తీర్చలేక ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఒక విద్యార్థి బెట్టింగ్ లో నష్టపోయి దొంగగా మారి జైలు జీవితాన్ని గడిపిన సందర్భాలు ఉన్నాయి.ప్రధానంగా గద్వాలలో ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడ్డ ఉపాధ్యాయులు గతంలో బెట్టింగ్లలో ఓడిపోయి ఒకరు 3 కోట్లు నష్టపోగా గద్వాల విడిచి వెళ్లాడు., ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయునితో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులు బెట్టింగ్స్ లో ఐదు కోట్ల మేరు నష్టం చవి చూశారని సమాచారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, మరికొందరు ఈ ఆటల పట్ల ఆకర్షితులవుతున్నారు.ప్రధానంగా యువతే ఇందులో బాధితులుగా మారుతున్నా బాధితులు వెలుగులోకి రావడం లేదు.

పల్లెలకు విస్తరించిన బెట్టింగ్

. గతంలో ఐపీఎల్‌ క్రికెట్‌ క్రీడలకు సంబంధించి పట్టణాల్లోనే సాగే బెట్టింగ్‌లు.. నేడు సెల్‌ఫోన్‌ పుణ్యమా అని పల్లెలకూ పాకింది. కొన్నేళ్ల కిందట అందరూ ఓ చోట కూర్చుని పందేలు కాసేవారు. పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు జరిగేటప్పుడు బుకీల పేర్లు వినిపించేవి. ప్రస్తుతం చాలావరకు వాట్సాప్ గ్రూప్ లు,ఆన్‌లైన్‌లోనే ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. యువత,ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర శాఖల ఉద్యోగులు సిబ్బంది సైతం పలు యాప్‌ల్లో పందేలు కాస్తూ అప్పుల వలయంలో చిక్కుకుంటున్నారు. అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

వంద నుంచి లక్ష వరకు బెట్టింగ్

Advertisement

ప్రతిరోజూ రాత్రి ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాక ముందు నుంచే ఈ బెట్టింగ్ మొదలవుతోంది. రూ.100 నుంచి మొదలు పెడితే రూ.లక్ష వరకు ఈ బెట్టింగ్ ఉంటుందని అంచనా. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఈ ఐపీఎల్ బెట్టింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఈ ఐపిఎల్ ఏ కాక వన్డే మ్యాచ్ లలో సైతం బెట్టింగ్ కు అలవాటు పడ్డ ప్రభుత్వ ఉపాధ్యాయులు తరచుగా ఈ వ్యాపకంలో మునిగి తేలుతున్నారు. ఈ బెట్టింగ్ లో జిల్లాలో అమాయక యువకులు ఎందరో రూపాయికి పది రూపాయలు సంపాదించుకోవచ్చునన్న ఆశతో ఈ బెట్టింగ్ వలలో చిక్కుకుని డబ్బులు పొగొట్టుకుని అందులో నుంచి బయటకు రాలేక పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించుకోలేక చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని ఆవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఈ బెట్టింగ్ దందా రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కాగా ఈ బెట్టింగ్లతో డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తుండగా మరికొంత మంది బహిరంగంగానే బెట్టింగ్ డబ్బుల కోసం గొడవలు పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Also read: కొల్లాపూర్ మార్కెట్ యార్డులో మంత్రి జూపల్లి.. ఆర్థిక సహాయం అందజేత!

జీవితాలు ఆలౌట్ అవుతున్నా మారని బెట్టింగ్ రాయుళ్లు..

Advertisement

ఈ బెట్టింగ్ భూతంతో ఎన్ని జీవితాలు అలౌల్ అవుతున్నా బెట్టింగ్ రాయుళ్లు మాత్రం మారడం లేదు. ఈ బెట్టింగ్ మాయలో పడి సర్వం కోల్పోతున్నారు. చిన్న సరదాగా మొదలైనా ఈ బెట్టింగ్ అలవాటు రానురానూ వ్యసనంగా మారుతోంది. కోడ్ భాషలో గుర్తులు పెట్టుకుంటూ బాలు వేసే క్రమంలో బెట్టింగ్ వేసేలా కోడ్లు ఉపయోగిస్తున్నారు.కొందరు మ్యాచ్ బెట్టింగ్ కాస్తుంటే మరికొందరు ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయని, మరి కొందరు ఒక ఓవర్లో ఎన్ని సిక్స్ లు వస్తాయని, ఇంకొందరు 20 ఓవర్లలో ఎన్ని రన్స్ వస్తాయని, ఎన్ని వికెట్లు పడతాయని, అసలు టాన్ ఎవరు గెలుస్తారని ఇలా ప్రతీ దానికి రూ.వందల్లో, వేలల్లో, లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారని, ఈ బెట్టింగ్స్ నేరుగా కొందరు పెడుతుంటే మరికొందరు బెట్టింగ్ యాప్ లలో పెడుతునట్లు సమాచారం. ఈ బెట్టింగ్లలో డబ్బులు పోతున్నా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న, పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బెట్టింగ్ రాయుళ్లలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు.

ఎక్కువ నష్టపోతుంది యువకులే..

వల్లెలు, పట్టణాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ బెట్టింగ్ మాయలో చాలా మంది పడుతుండగా ఎక్కువగా యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు,మైనర్లే నష్టపోతున్నారు. ఈజీ మనీ కోసం చాలా మంది యువకులు ఈ బెట్టింగ్ మహమ్మారి మాయలో పడుతున్నారు. ఒక మ్యాచ్ లో ఓడిపోతే మరో మ్యాచ్ లో నష్టాన్ని రాబట్టుకునేందుకు అప్పులు చేసి ఎక్కువ డబ్బులతో బెట్టింగ్ కాస్తున్నారు. ఇలా ఒక దానిలో పోగట్టుకుంటే మరో దానిలో ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ కాస్తూ అప్పుల పాలవుతున్నారు. ఈ బెట్టింగ్ లో గెలిచిన వారు సైతం మరో మ్యాచ్ లో మరి కొంత ఎక్కువగా సంపాదించుకోవాలన్న ఆశతో ఎక్కువగా డబ్బులు పెట్టి ఉన్నది పోగుట్టుకుంటున్నారు. కాగా ఈ బెట్టింగ్లలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం బెట్టింగ్లు పెడుతున్నట్లు సమాచారం.

Also Read: బండి సంజయ్‌ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి పదవి ఊడాల్సిందే!

డబ్బుల కోసం స్నేహితులతో గొడవలు, కుటుంబంలో కలహాలు

బెట్టింగ్ డబ్బుల కోసం ఓడిన వ్యక్తిని గెలిచిన వ్యక్తి డబ్బుల కోసం పదే పదే అడుగుతుండటంతో గ్రామాల్లో బెట్టింగ్ రాయుళ్లు గొడవలకు దిగుతున్నారు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నవారు ఈ బెట్టింగ్ కారణంగా ఒకరిపై ఒకరు పగలు పెంచుకుంటూ బహిరంగంగానే దాడులు చేసుకుంటున్నారు. మరికొందరైతే డబ్బుల కోసం కుటుంబంలో తల్లిదండ్రులతో గొడవలు పడటం, ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుమారుడు పెడుతున్న ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక, కుమారుడిలో వచ్చిన మార్పుతో లోలోపల చాలా మంది నరకయాతన అనుభవిస్తున్నారు.

కోడింగ్ భాషను ఉపయోగిస్తున్న బెట్టింగ్ రాయుళ్లు

ఈ బెట్టింగ్ పెడుతున్న చాలా మంది ఎవరికి అనుమానం రాకుండా కోడింగ్ భాషను ఉపయోగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వాట్సప్ లలో బెట్టింగ్ రాయుళ్లు కిలోకు ఎంత చక్కెర ఇస్తావ్ అని, వందకు 10 కిలోల ఉల్లిగడ్డ అంటూ ఇలా చాలా రకాల కోడింగ్స్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. మరికొందరు కేవలం చాటింగ్ లోనే ఈ బెట్టింగ్ తంతునంత కొనసాగిస్తున్నారు. పల్లెల్లో నలుగురు ఒక దగ్గరికి చేరి ముందుగానే మధ్యవర్తి వద్ద ఈ డబ్బులను పెట్టి మధ్యవర్తికి మ్యాచ్కు కొంత చొప్పున డబ్బులు చెల్లిస్తున్నారు.

బెట్టింగ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టాం : జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

బెట్టింగ్ మహమ్మారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. బెట్టింగ్ మాయలో పడి యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్ రాయుళ్లు చేసే వ్యవహారాలపై కఠినంగా శిక్ష ఉంటుంది. గ్రామాల్లో బెట్టింగ్ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఏవరైనా బెట్టింగ్లకు పాల్పడితే తమకు సమాచారం అందజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.

Also Read: ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అయితే మీ బ్యాగ్‌లో ఈ లాంగ్ బ్యాటరీ స్పీకర్ ఉండాల్సిందే!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×