Betting Apps Suicide: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? దర్యాప్తు నత్తనడకగా సాగుతోంది? మొదట్లో హడావుడి చేసిన పోలీసులు ఎందుకు సైలెంట్ అయ్యారు? బడాబాబులు ఒత్తిడి తెచ్చారా? నోటీసులు అందుకున్న వ్యక్తులు అందుబాటులో లేరా? తాజాగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అయినవాళ్లను వదిలి హఠాత్తుగా వెళ్లిపోయాలనే ఆలోచన మంచిదా? అంటూ ప్రశ్నించారు.
అరచేతిలో టెక్నాలజీ వచ్చాక రకరకాల యాప్‌లు పుట్టుకొచ్చాయి. ప్రతీ దానికి నెగిటివ్, పాజిటివ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ అరచేతిలోకి వచ్చాక లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి అడక్ట్ అయి రకరకాల వ్యసనాలకు అలవాటు పడుతున్నారు యువత. ఈ ఉచ్చు నుంచి బయటపడలేక, అటు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పలేక అర్థాంతరంగా తనువు చాలించారు.. ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ద్వారా యూత్‌ని టార్గెట్ చేశాయి కొన్ని కంపెనీలు. దీని వెనుక కర్మ, కర్త, క్రియ ఎవరన్నది తెలీదు. కేవలం బ్రాండ్ పేరుతో సెలబ్రిటీల ద్వారా ప్రమోట్ చేయిస్తున్నారు. నిజమేనని నమ్మి యువత దీని ఉచ్చులో పడుతున్నారు. అప్పులు చేసిన డబ్బులు పొగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
సజ్జనార్ రియాక్ట్
దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం మొదలుపెట్టడం, తెలుగు రాష్ట్రాలను కదలించింది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోపడి ఎంటెక్ స్టూడెంట్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
ALSO READ: నేను రాను బిడ్డో.. సీఎం రేవంత్ ట్వీట్
‘‘వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వద్దు! కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాన్ని నిమిషంలో తీసుకుని ఏం సాధిస్తారని సూటిగా ప్రశ్నించారు. బలవన్మరణాలు చేసుకుంటే కష్టాలు, బాధలు పోతాయా!? అంటూ ప్రశ్నించారు. అయిన వాళ్ళందరిని వదిలి ఇలా హఠాత్తుగా వెళ్లిపోయాలనే ఆలోచన మంచిది కాదు. చనిపోవడానికి ఒక్కటే కారణం కానీ, బతకడానికి 1000 కారణాలు ఉంటాయి, ఈ విషయాన్ని తెలుసుకోండి. బలవన్మరణాలు వద్దు.. బతికి సాధించడమే ముద్దు!’’ అని రాసుకొచ్చారు.
ఎంటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
బుధవారం రాత్రి ఎంటెక్ స్టూడెంట్ బెట్టింగ్ యాప్ ఉచ్చులో పడ్డారు. దీన్ని నుంచి బయటకు రాలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాలకు చెందిన 22 ఏళ్ల పవన్ ఎంటెక్ చదువుతున్నాడు. ప్రస్తుతం అత్తాపూర్‌లో అద్దెకు ఉంటున్నాడు. బ్యాచులర్ అంటే చెప్పాల్సిన అసవరం లేదు. దగ్గరలో పేరెంట్స్ ఉండరు. చేస్తుందని తప్పు అని చెప్పేవారు తక్కువ మంది ఉంటారు. ఆ విధంగా ఆన్ లైన్‌లో బెట్టింగ్ యాప్ లకు అలవాడు పడ్డాడు.
డబ్బులు వస్తాయని ఆశతో అప్పులు చేసి మరీ నష్టపోయాడు. దీన్ని నుంచి బయటపడటానికి తెగ ప్రయత్నాలు చేశాడు. ఈ విషయం తండ్రికి తెలియడంతో పలు దఫాలుగా డబ్బులు పంపాడు. చివరకు తన దగ్గరున్న బైక్, సెల్‌ఫోన్ సైతం అమ్మేశాడు. అయినప్పటికీ అప్పులు ఏ మాత్రం తీరలేదు. ఈ సమస్య నుంచి బయటపడలేక ఆందోళనకు గురయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు.
బుధవారం రాత్రి రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమస్యలు వచ్చిన ప్రతీసారి ఆత్మహత్యలు చేసుకుంటూ దేశంలో పుట్టినవారి కంటే చనిపోయేవాళ్లు ఎక్కువమంది ఉంటారు. చేసిన అప్పును మెల్లగా తీర్చడానికి కష్టపడాలి. అప్పుడే సాధించినవాళ్లమి అవుతారు. చేతిక అంది వచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్యలకు పాల్పడితే తల్లిదండ్రులు కుమిలిపోతారు. తస్మాత్.. జాగ్రత్త. యువతా మేలుకో.
బెట్టింగ్ యాప్స్ ఆత్మహత్యలపై సజ్జనార్ ట్వీట్..
కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుని ఏం సాధిస్తారు..?
చనిపోవడానికి ఒకటే కారణం, కానీ బతకడానికి వెయ్యి కారణాలు ఉంటాయి
బలవన్మరణాలు వద్దు.. బతికి సాధించడమే ముద్దు
– సజ్జనార్#SayNoToBettigApps https://t.co/MLJIDFZCKV pic.twitter.com/CuOVV9gAGz
— BIG TV Breaking News (@bigtvtelugu) April 18, 2025